Bank of China
-
వ్యాపార అవకాశాలకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), చైనా బ్యాంకింగ్ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్– బ్యాంక్ ఆఫ్ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం వల్ల రెండు బ్యాంకుల క్లయింట్లకూ నెట్వర్క్ విస్తృతమవుతుంది. విస్తృత స్థాయిలో సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉండగా, ముంబైలో బీఓసీ తన బ్రాంచీని విస్తృతం చేస్తోంది. -
బ్యాంక్ ఆఫ్ చైనా వస్తోంది!
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా బ్యాంక్ ఆఫ్ చైనాకు భారత్‌లో కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి అనుమతినిచ్చింది. చైనాలో గత నెల జరిగిన ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ కలుసుకున్నప్పుడు ఇరువురి మధ్య బ్యాంక్ కార్యకలాపాలకు అంశం చర్చకు వచ్చింది. భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్‌ల ఏర్పాటుకు మోదీ అంగీకారం తెలిపారు. భారత్‌లో తొలి బ్రాంచ్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్బీఐ లైసెన్స్ జారీచేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా రక్షణ మంత్రి త్వరలో భారత్‌లో పర్యటించనున్నారని పేర్కొన్నాయి. -
పాక్-చైనా భాయిభాయీ!
బీజింగ్ : భారత్‌ను దెబ్బకొట్టేలా పాకిస్తాన్-చైనా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌లోని మసూద్ అజర్‌లాంటి ఉగ్రవాదులకు వంత పాడుతున్నా చైనా.. తాజాగా అక్కడ బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ చైనా తన తొలి బ్రాంచ్‌ను కరాచీలో ఆరంభించింది. బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ ఏర్పాటు సందర్భంగా.. బీజింగ్-ఇస్లామాబాద్ మధ్య సోదర సంబంధాలు మరింత గట్టిపడతాయని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్-చైనా మధ్య స్నేహసంబంధాల్లో ఇది ఒక మరపురాని ఘట్టమని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా చైనా లీడింగ్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ చైనా దక్షిణాసియాలోనే తొలిసారి తన బ్రాంచ్‌ను పాకిస్తాన్లో ఏర్పాటు చేయడం గమనార్హం. బ్యాంక్ ఆఫ్ చైనాకన్నా ముందుగానే ఇండస్ట్రియల్ అండ్కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇప్పటికే పాకిస్తాన్లో రెండు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. -
చైనా బ్యాంకర్లతో జైట్లీ సమావేశం
బీజింగ్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐదు రోజుల చైనా పర్యటన గురువారం ప్రారంభమైంది. భారత మౌలిక వసతుల నిర్మాణంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టే దిశగా జైట్లీ తొలిరోజు చైనా అగ్రశ్రేణి బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లతో సంప్రదింపులు జరిపారు. బీజింగ్ చేరుకున్న ఆయన ముందుగా బ్యాంకు ఆఫ్ చైనా చైర్మన్ టియనా గులితో భేటీ అయ్యారు. సావరీన్ వెల్త్ ఫండ్ మేనేజర్లు, సంస్థాగత పెట్టుబడిదారులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొన్నారు. శుక్రవారం చైనా ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, అక్కడి వ్యాపార వేత్తలతో జరగనున్న ‘ఇన్వెస్ట్ ఇన్ ఇండియా’ అనే వ్యాపార సదస్సులో జైట్లీ పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న మూడో రోజు ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) బోర్డ్ గవర్నర్లతో సమావేశం అవుతారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మౌలికరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.6 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉండగా, 7.5 శాతం వాటాతో రెండో అతిపెద్ద భాగస్వామ్య దేశంగా భారత్ ఉంది. రష్యా 5.93 శాతం, జర్మనీ 4.5 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. 57 దేశాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా చేరాయి. 25న జరిగే ఏఐఐబీ సమావేశంలో తొలి విడతగా పలు దేశాలకు రుణాల మంజూరును బ్యాంకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 26న చైనా సహా పలు దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులతో జరిగే ఓ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో జైట్లీ పాల్గొననున్నారు. అలాగే, ఏఐఐబీ నిర్వహించే పర్యావరణ అనుకూల మౌలిక వసతులు అనే సదస్సులోనూ బ్రిక్స్ బ్యాంకు అధిపతి కేవీకామత్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితరులతో కలసి పాల్గొననున్నారు. చివరిగా ఈ నెల 27న చైనా ఆర్థిక మంత్రి లూజివీతో జైట్లీ సమావేశమై రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం సహా పలు అంశాలపై చర్చలు జరుపుతారు. -
గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా
న్యూఢిల్లీ: గ్రాస్‌వీనర్ హోటల్ కొనుగోలుపై వస్తున్న వార్తలకు తెర దించుతూ, లండన్‌లోని తమ గ్రాస్‌వీనర్ హోట ల్ అమ్మకపు వేలంలో (బిడ్డింగ్) తాము పాల్గొనడం లేదని సహారా గ్రూప్ స్పష్టంచేసింది. ఇచ్చిన రుణాలను చెల్లించక పోవడంతో బ్యాంకు ఆఫ్ చైనా సహారాకు చెందిన గ్రాస్‌వీనర్ హోటల్‌తోపాటు మరో రెండు విదేశీ హోటళ్లను అమ్మకానికి ఉంచిన విషయం తెలిసిందే. 2010-12 మధ్యకాలంలో 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీల మొత్తం ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు.