అక్రమ డిపాజిట్లను అడ్డుకోవాలి..
♦ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
♦ అక్రమ ధనార్జనా నిరోధక పోర్టల్ ఆవిష్కరణ
ముంబై: అక్రమ డిపాజిట్ల పెరుగుదలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కంపెనీని ప్రారంభించడం, కొన్ని తప్పుడు పథకాలతో కొన్ని నెలలు కంపెనీని నిర్వహించడం, భారీ డిపాజిట్లను సేకరించడం అటు తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడం (ఫ్లై-బై-నైట్ ఆపరేటర్స్) వంటి ఘటనలను ముందే అడ్డుకోడానికి తగిన చర్యలు అవసరమన్నారు. ఈ తరహా సంస్థలు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. ‘‘ఈ సంస్థలు డబ్బుతో ఉడాయించడానికి ముందే.
ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు, న్యాయ నిర్వహణ సంస్థలు ఉమ్మడిగా వీటిపై చర్యకు ఉపక్రమించాలి. డిపాజిటర్ల రక్షణ చట్టం, రాష్ట్ర స్థాయి సహకార కమిటీల వంటివి ఈ నకిలీ సంస్థల ఆట కట్టించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రూ.50 లక్షలు ఇస్తానన్న వ్యక్తి నన్ను మొదట రూ.25,000 కట్టమని ఎందుకు అడిగాడు? ఇచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కదా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’ అని సూచించారు.
అక్రమాల గుట్టురట్టుకు పోర్టల్...
అక్రమ డిపాజిట్ల సేకరణ గుట్టును రట్టు చేయడానికి ఉద్దేశించిన ఒక పోర్టల్‌ను ఈ సందర్భంగా రాజన్ ఆవిష్కరించారు. ట్చఛిజ్ఛ్టి.టఛజీ.ౌటజ.జీ పేరుతో ఏర్పాటైన ఈ సైటు ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పిస్తుంది. ఒక సంస్థ ఏ రెగ్యులేటర్ వద్ద రిజిస్టర్ అయ్యింది? అసలు రిజిస్ట్రేషన్ అయ్యిందా... లేదా? వంటి వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటుంది. కాగా చదువుకున్న వారు సైతం మోసాలకు గురవుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా ఈ సందర్భంగా చెప్పారు.
నకిలీ స్కీముల్లోకి నల్లధనం: రామన్
కార్యక్రమంలో పాల్గొన్న సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సహారా ఉదంతాన్ని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో డిపాజిటర్లకు తిరిగి చెల్లించడానికి తగిన మొత్తం సెబీ వద్ద ఉన్నా... తీసుకోడానికి తగిన సంఖ్యలో ఎవ్వరూ ముందుకురావడం లేదని చెప్పారాయన. ‘‘ఆర్థిక మంత్రిత్వ శాఖ డెరైక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ భాగస్వామ్యంతో నకిలీ స్కీముల్లోకి వచ్చిన నల్లడబ్బు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. సహారా విషయంలో భారీ ఎత్తున డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా ప్రపంచంలో ఏ రెగ్యులేటర్ చేయనంత పని సెబీ చేసింది. సెబీ లక్ష్యం ఒక్కటే. డిపాజిటర్ల డబ్బు ఎవరిదివారికి చెల్లించటమే’’ అని ఆయన వివరించారు. పెరల్ గ్రూప్ విషయంలోనూ ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి సెబీ అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు.