illegal deposit
-
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్‌పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్‌కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్‌పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే..
-
నల్ల‘మార్గ’o ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్టలో దాగిన ‘నల్ల’పాములు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బెంబేలెత్తుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు. బ్యాంకులను కాదని చిట్టీ కంపెనీలోనా? రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులను సీఐడీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడించాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడించేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఇదే తరహా మోసంలో సహారా చైర్మన్‌కు జైలు శిక్ష బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్‌దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుకాయించబోయి దొరికిన రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడంలేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది. -
అక్రమ డిపాజిట్లను అడ్డుకోవాలి..
♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ అక్రమ ధనార్జనా నిరోధక పోర్టల్ ఆవిష్కరణ ముంబై: అక్రమ డిపాజిట్ల పెరుగుదలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కంపెనీని ప్రారంభించడం, కొన్ని తప్పుడు పథకాలతో కొన్ని నెలలు కంపెనీని నిర్వహించడం, భారీ డిపాజిట్లను సేకరించడం అటు తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడం (ఫ్లై-బై-నైట్ ఆపరేటర్స్) వంటి ఘటనలను ముందే అడ్డుకోడానికి తగిన చర్యలు అవసరమన్నారు. ఈ తరహా సంస్థలు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. ‘‘ఈ సంస్థలు డబ్బుతో ఉడాయించడానికి ముందే. ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు, న్యాయ నిర్వహణ సంస్థలు ఉమ్మడిగా వీటిపై చర్యకు ఉపక్రమించాలి. డిపాజిటర్ల రక్షణ చట్టం, రాష్ట్ర స్థాయి సహకార కమిటీల వంటివి ఈ నకిలీ సంస్థల ఆట కట్టించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రూ.50 లక్షలు ఇస్తానన్న వ్యక్తి నన్ను మొదట రూ.25,000 కట్టమని ఎందుకు అడిగాడు? ఇచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కదా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’ అని సూచించారు. అక్రమాల గుట్టురట్టుకు పోర్టల్... అక్రమ డిపాజిట్ల సేకరణ గుట్టును రట్టు చేయడానికి ఉద్దేశించిన ఒక పోర్టల్‌ను ఈ సందర్భంగా రాజన్ ఆవిష్కరించారు. ట్చఛిజ్ఛ్టి.టఛజీ.ౌటజ.జీ పేరుతో ఏర్పాటైన ఈ సైటు ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పిస్తుంది. ఒక సంస్థ ఏ రెగ్యులేటర్ వద్ద రిజిస్టర్ అయ్యింది? అసలు రిజిస్ట్రేషన్ అయ్యిందా... లేదా? వంటి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటుంది. కాగా చదువుకున్న వారు సైతం మోసాలకు గురవుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఈ సందర్భంగా చెప్పారు. నకిలీ స్కీముల్లోకి నల్లధనం: రామన్ కార్యక్రమంలో పాల్గొన్న సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సహారా ఉదంతాన్ని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో డిపాజిటర్లకు తిరిగి చెల్లించడానికి తగిన మొత్తం సెబీ వద్ద ఉన్నా... తీసుకోడానికి తగిన సంఖ్యలో ఎవ్వరూ ముందుకురావడం లేదని చెప్పారాయన. ‘‘ఆర్థిక మంత్రిత్వ శాఖ డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ భాగస్వామ్యంతో నకిలీ స్కీముల్లోకి వచ్చిన నల్లడబ్బు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. సహారా విషయంలో భారీ ఎత్తున డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా ప్రపంచంలో ఏ రెగ్యులేటర్ చేయనంత పని సెబీ చేసింది. సెబీ లక్ష్యం ఒక్కటే. డిపాజిటర్ల డబ్బు ఎవరిదివారికి చెల్లించటమే’’ అని ఆయన వివరించారు. పెరల్ గ్రూప్ విషయంలోనూ ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి సెబీ అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు.