
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌దిగ్గజం శాంసంగ్‌కు దీటుగా రియల్‌మీ సీ1 (2019) వేరియంట్‌ను సోమవారం లాంచ్ చేసింది. ఇటీవల భారత్‌లో విడుదల చేసిన రియల్‌మీ ఇప్పుడు ఇందులోని మరో రెండు వేరియంట్లను భారత్‌లో విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర భారత్‌లో రూ. 7,499 కాగా, 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర రూ.8,499. ఫిబ్రవరి 5 నుంచి ఈ రెండింటినీ ప్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. రియల్‌మీ సీ1ను గతేడాది సెప్టెంబరులో భారత్‌లో విడుదల చేసింది. ధర రూ.6,999. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన డ్యూయల్ రియర్, సెల్పీ కెమెరాలు ఉన్నాయి. ఫేసియల్ అన్‌లాక్, స్మార్ట్ లాక్ ఫీచర్, పవర్ సేవింగ్ ఫీచర్లు, యాప్ ఫ్రీజింగ్ పవర్ సేవర్, క్విక్ యాప్ ఫ్రీజింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ సీ1(2019) ఫీచర్లు
6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 సాక్
4230 ఎంఏహెచ్ బ్యాటరీ