
సాక్షి, ముంబై : ఒప్పో చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ నెల 15వ తేదీన రియల్‌మి ఎక్స్ పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. చైనాలో లాంచ్ చేసిన రియల్‌మి ఎక్స్ కంటే భిన్నంగా భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నామని రియల్‌మీ సీఈవో మాధవ్ సేత ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. పాప్ అప్ కెమెరా, వూక్ ప్లాష్ చార్జ్ 3.0, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో 4జీబీ, 6 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ప్రీమియం వెర్షన్ ధరను రూ.18,000గా నిర్ణయించే అవకాశం ఉందని అంచనా.
రియల్‌మి ఎక్స్ ఫీచర్లు
6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 9.0 పై
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
48 + 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3765 ఎంఏహెచ్ బ్యాటరీ
Charge Xponentially fast and shoot your phone’s battery to 55% in just 30 mins without any heating issue! Meet VOOC Flash Charge 3.0 on #realmeX.
— realme (@realmemobiles) July 8, 2019
Witness the launch of #realmeX at 12:30 PM, 15th July on https://t.co/reDVoAlOE1.
Know more: https://t.co/BYqF48ZiWb#LeapToPremium pic.twitter.com/Ynhjxr1h4y