
ఏడో వారమూ తగ్గిన పుత్తడి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా పుత్తడి ధర వరుసగా ఏడోవారమూ క్షీణించింది. జ్యువెల్లరీ స్టాకిస్టుల నుంచి డిమాండ్ కొరవడటం, ప్రపంచ మార్కెట్లో బలహీన ట్రెండ్ కారణంగా ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయని విశ్లేషకులు చెప్పారు. గతవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి ధర 10 గ్రాములకు అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 120 క్షీణించి, రూ. 24,920 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 24,770 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,095 డాలర్ల వద్ద క్లోజయ్యింది.