టారిఫ్ ధరలు తగ్గొచ్చు.. కానీ ఉచిత కాల్స్ కష్టమే?: ఎయిర్ టెల్
న్యూఢిల్లీ: టెలికం మార్కెట్‌లోకి రిలయన్స్ జియో ఎంట్రీ నేపథ్యంలో టారిఫ్ ధరలు కొంతమేర తగ్గొచ్చని దేశీ దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ సంకేతాలనిచ్చింది. అరుుతే అన్ని మొబైల్ ప్లాన్‌సకు ఉచిత కాల్స్ అందించడమనేది సాధ్యం కాదని తేల్చేసింది. తాము ఇప్పటికే ఇన్‌ఫినిటీ ప్లాన్ (రూ.999 ప్లాన్)లో యూజర్లకు ఉచిత కాల్స్‌ను అందిస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అరుుతే ఇలా ఉచిత కాల్స్‌ను అన్ని ప్లాన్‌సకు అందిచడం కుదరదని పేర్కొన్నారు.
‘దేశంలో ఫీచర్ ఫోన్లు వాడే వారు ఉన్నారు. అలాగే లోఎండ్ స్మార్ట్‌ఫోన్‌స ఉపయోగించే వారు ఉన్నారు. వీరి సేవల వినియోగం వేర్వేరుగా ఉంటుంది. ఒకరు డేటాకు ప్రాధాన్యమిస్తే.. మరొకరు కాల్స్ ఎక్కువగా మాట్లాడతారు. అలాగే కాల్స్, డేటా రెండింటినీ కోరుకునే వారు కూడా మార్కెట్‌లో ఉంటారు’ అని వివరించారు. ‘మీరు కాల్స్‌కు మాత్రమే రీచార్జ్ చేసుకుంటారని భావిస్తే... ఇలాంటప్పుడు ఏ కంపెనీ అరుున ఉచిత కాల్స్‌ను ఎలా ఆఫర్ చేస్తుంది’ అని పేర్కొన్నారు.