Free calls
-
జియో సరికొత్త ఆఫర్
సాక్షి, అమరావతి: రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లపై ఉచిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,500 డిపాజిట్ చేసి జియో ఫోను తీసుకుంటే మూడేళ్ల తర్వాత ఈ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తుంది. కానీ ప్రతీ నెలా రూ.49 చెల్లిస్తే నెల రోజుల పాటు ఉచితంగా నిరంతరాయంగా మాట్లాడుకునే వెసులుబాటును కల్పిస్తోంది. గతంలో కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఉపయోగించే ఈ ఫీచర్ ఫోన్ ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ క్రోమ్‌లతో పాటు జియో టీవీ ద్వారా 450 ఛానళ్లను, జియో మ్యూజిక్ ద్వారా అనేక పాటలను వినవచ్చు. జియో ఎల్టీఈ టారిఫ్ ప్లాన్ ద్వారా వీడియోకాల్స్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లభించే ఈఫోన్లో మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. -
ఆదివారం ఉచిత కాల్స్ రద్దు
కోల్కత్తా : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఆదివారం ల్యాండ్లైన్లకు అందిస్తున్న ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను ఫిబ్రవరి 1 నుంచి రద్దు చేయబోతుంది. రాత్రిపూట అందించే ఉచిత కాలింగ్ ప్రయోజనాలను నిరోధించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం అనంతరం బీఎస్ఎన్ఎల్ ఈ ప్రకటన చేసింది. ''ఫిబ్రవరి నుంచి ఆదివారం ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని విత్‌డ్రా చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. కానీ కలకత్తా టెలిఫోన్స్ నుంచి, మా వినియోగదారులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రణాళికలపై పని చేస్తున్నాం'' అని కోల్కత్తా టెలిఫోన్స్(కాల్టెల్) చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్పీ తిరపతి చెప్పారు. వారంలో సాధారణ రోజుల మాదిరిగా.. ల్యాండ్‌లైన్, కోంబో, ఎఫ్టీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై ఆదివారం రోజూ కస్టమర్లకు ఛార్జీలు విధించనున్నామని తెలిపారు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. జనవరి మధ్యలోనే రాత్రిపూట ఆఫర్ చేసే కాలింగ్ స్కీమ్‌ను బీఎస్ఎన్ఎల్ సమీక్షించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటల నుంచి ఉచిత కాల్స్ ఆఫర్ చేసే బదులు రాత్రి 10.30 గంటల నుంచి ఆఫర్ చేయడం ప్రారంభించిందని కాల్టెల్ టెక్నికల్ సెక్రటరీ సీజీఎం గౌతమ్ చక్రబోర్టి చెప్పారు. 2016 ఆగస్టు 21న ఆదివారం ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని, రాత్రి ఉచిత కాలింగ్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్: రోజుకు 4జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ రూ.999ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రీ పెయిడ్ రీఛార్జ్ ఆఫర్ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుందని, దీని కింద ఉచిత వాయిస్ కాల్స్‌ను కూడా అందించనున్నట్టు పేర్కొంది. అంటే 28 రోజుల్లో 122జీబీని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు పొందుతారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి టెలికాం సెక్టార్లో ఈ డేటా యుద్ధం నెలకొంది. రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జియో రూ.999 రీఛార్జ్ కింద 90జీబీ 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే 90 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ 90జీబీ డేటా వాడకం అయినపోయిన తర్వాత స్పీడు 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఆ ప్లాన్ జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. తాజాగా జియో తన రూ.149 ప్లాన్‌ను అప్డేట్ చేసింది. -
బేసిక్ ఫోన్లలోనూ జియో ఫ్రీ కాల్స్.. !
• అపరిమిత ఉచిత కాల్స్ ప్యాకేజీకి రిలయన్స్ జియో నిర్ణయం • మొబైల్ హ్యాండ్సెట్ల తయారీకి పలు కంపెనీలతో సంప్రదింపులు... • ధర రూ.1,000-1,500 ఉండే అవకాశం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెలికం రంగంలో మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది. లైఫ్ బ్రాండ్‌లో 4జీ వారుుస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లను రూ.2,999లకే అందించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఫీచర్ ఫోన్లపై దృష్టిసారించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే జియో వెల్కమ్ ఆఫర్‌తో అపరిమిత డేటా, కాల్స్‌ను ఉచితంగా అందుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనలేని వారు ఈ ఆఫర్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బేసిక్ ఫోన్లనూ వారుుస్ ఓవర్ ఎల్టీఈ (వీఓఎల్టీఈ) ఉండేలా తెస్తే అన్ని వర్గాలకూ చేరువ కావొచ్చని జియో భావిస్తోంది. దీనికోసం పలు మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. అన్నీ అనుకూలిస్తే నవంబర్లోనే ఇవి మార్కెట్లోకి వచ్చే వీలుంది. నిమగ్నమైన కంపెనీలు.. వారుుస్ ఓవర్ ఎల్టీఈ ఆధారిత ఫీచర్ ఫోన్లను సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెడతామని ముంబైలోని జియో ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫోన్ల సరఫరాకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రసుతం ఈ ఫోన్లను పరీక్షిస్తున్నట్టు కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ వెల్లడించారు. కార్బన్ బ్రాండ్‌లోనే వీటిని విడుదల చేస్తామని, జియో కోరితే లైఫ్ బ్రాండ్‌కూ సరఫరా చేస్తామని చెప్పారు. వీఓఎల్టీఈ ఫోన్ల కోసం జియో తమతో చర్చిస్తున్నట్లు ఇన్ఫోకస్ నేషనల్ సేల్స్ హెడ్ పియూష్ పురి చెప్పారు. కాగా దీనిపై తామింకా ఏ నిర్ణయం తీసుకోలేదని వీడియోకాన్ మొబైల్స్ సీఈవో జెరాల్డ్ పెరీరా చెప్పారు. భవిష్యత్‌లో సంస్థ తీసుకొచ్చే టెక్నాలజీపై ఇప్పుడే స్పందించలేమంటూ శామ్సంగ్ మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ సమాధానం దాటవేశారు. అపరిమిత కాల్స్.. జియో ఇటీవలే రూ.19 మొదలుకుని రూ.4,999 వరకు గల ధరలో శ్రేణిలో ప్రీ, పోస్ట్ పెరుుడ్ ప్లాన్సను ప్రకటించింది. కస్టమర్లు ఏ ప్యాక్ తీసుకున్నా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్లతోపాటు రోమింగ్ కూడా ఉచితమే. ఇక రిలయన్స జియో లైఫ్ ఫీచర్ ఫోన్లు రూ.1,000-1,500 ధరల్లో ఉండొచ్చని సమాచారం. నిజానికి పరిమాణం పరంగా దేశంలో మొబైల్స్ విక్రయాల్లో 54 శాతం వాటా బేసిక్ ఫోన్లదే. ఇవి నెలకు కోటి యూనిట్లు అమ్ముడవుతున్నారుు. జియో వెల్కమ్ ఆఫర్‌ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్లకుపైగా కస్టమర్లు తీసుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణ నుంచి 30 లక్షల మంది ఉంటారు. కాల్స్‌కు డేటా ఖర్చుకాదు: రిలయన్స నిజానికి రిలయన్స దేశవ్యాప్తంగా 4జీ లెసైన్‌స మాత్రమే ఉంది. దీంతో వారుుస్ కాల్స్‌ను కూడా అది డేటా ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రీపెరుుడ్ కస్టమర్లు ఏ రూ.149 మంత్లీ ప్యాకేజో తీసుకుంటే... ఆ డేటా మొత్తం కాల్స్‌కే ఖర్చరుుపోతుందిగా? కాల్స్ ఉచితంగా ఇచ్చి లాభమేంటి? అనే సందేహాలున్నారుు. ఇదే విషయాన్ని రిలయన్స వర్గాల వద్ద ప్రస్తావించగా... ‘‘కాల్స్‌కు డేటా అస్సలు ఖర్చుకాదు. అందుకే కస్టమర్లు అతి తక్కువ డేటా ప్యాకేజీ తీసుకున్నా అపరిమిత వారుుస్ కాల్స్ చేసుకోవచ్చు’’ అని సమాధానమిచ్చారు. మున్ముందు ఈ టెక్నాలజీ ఎన్ని మార్పులకు కారణమవుతుందో చూడాల్సిందే. -
టారిఫ్ ధరలు తగ్గొచ్చు.. కానీ ఉచిత కాల్స్ కష్టమే?: ఎయిర్ టెల్
న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ నేపథ్యంలో టారిఫ్ ధరలు కొంతమేర తగ్గొచ్చని దేశీ దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ సంకేతాలనిచ్చింది. అరుుతే అన్ని మొబైల్ ప్లాన్సకు ఉచిత కాల్స్ అందించడమనేది సాధ్యం కాదని తేల్చేసింది. తాము ఇప్పటికే ఇన్ఫినిటీ ప్లాన్ (రూ.999 ప్లాన్)లో యూజర్లకు ఉచిత కాల్స్‌ను అందిస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అరుుతే ఇలా ఉచిత కాల్స్‌ను అన్ని ప్లాన్సకు అందిచడం కుదరదని పేర్కొన్నారు. ‘దేశంలో ఫీచర్ ఫోన్లు వాడే వారు ఉన్నారు. అలాగే లోఎండ్ స్మార్ట్ఫోన్స ఉపయోగించే వారు ఉన్నారు. వీరి సేవల వినియోగం వేర్వేరుగా ఉంటుంది. ఒకరు డేటాకు ప్రాధాన్యమిస్తే.. మరొకరు కాల్స్ ఎక్కువగా మాట్లాడతారు. అలాగే కాల్స్, డేటా రెండింటినీ కోరుకునే వారు కూడా మార్కెట్లో ఉంటారు’ అని వివరించారు. ‘మీరు కాల్స్‌కు మాత్రమే రీచార్జ్ చేసుకుంటారని భావిస్తే... ఇలాంటప్పుడు ఏ కంపెనీ అరుున ఉచిత కాల్స్‌ను ఎలా ఆఫర్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్లకూ ఫ్రీ కాల్స్
న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్, మొబైల్ కనెక్షన్లు కలిగిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు త్వరలో మొబైల్ ఫోన్స్ నుంచి ఉచిత కాల్ సౌకర్యాన్ని పొందనున్నారు. దీపావళి నాటికి ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందించడం కోసం బీఎస్ఎన్ఎల్ కన్వర్జన్సీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ మొబైల్, ల్యాండ్‌లైన్ యూజర్లను అనుసంధానిస్తుంది. దీంతో ల్యాండ్‌లైన్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు వారి బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి రాత్రి పూట ఉచిత కాల్స్ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. మొబైల్, ల్యాండ్‌లైన్ ఖాతాలను ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేసుకోవచ్చని చెప్పారు. -
రాత్రంతా మాట్లాడుకో..!
ఈనెల 1 నుంచి ఉచిత కాల్స్ ల్యాండ్ లైన్ నుంచి ఏ ఫోన్‌కైనా.. బీఎస్ఎన్ఎల్ అపూర్వ కానుక కరీంనగర్ క్రైం : ల్యాండ్ ఫోన్లకు ఆదరణ పెంచేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త పథకం ప్రవేశపెట్టింది. మే డే సందర్భంగా ల్యాండ్ ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జిల్లాలో 23 వేలకు పైగా ల్యాండ్ లైన్ వినియోగదారులు, 9 వేలకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులున్నారు. మొబైల్ రాకతో క్రమంగా వినియోగదారులు సంఖ్య తగ్గిపోరుుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకనే వారు తప్ప ల్యాండ్ ఫోన్లు వినియోగించేవారే లేరు. ల్యాండ్‌ఫోన్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడునే అవకాశం కల్పించింది. బీఎస్ఎన్ఎల్తో పాటు ఇతర ఆపరేటర్లకు చెందిన ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితం మాట్లాడుకునే అవకాశం కల్పించింది. లోకల్, ఎస్డీడీ కాల్స్ కూడా ఉచితమే. కొత్త కనెక్షన్ కోసం రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ అద్దె పట్టణాల్లో ఈ నెల 1 నుంచి రూ.220, గ్రామీణపరిధిలో రూ.160. యువతే టార్గెట్ మారుతున్న నగర జీవన ైశె లిలో రాత్రి 11 తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఈక్రమంలో రాత్రి వేళల్లోనే కుర్రకారు ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీరే కాకుండా వివిధ ఉద్యోగాలు చేసే వారు సైతం రాత్రి వేళనే తీరిగ్గా ఉంటుండడంతో ఈ పథకానికి క్రేజీ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా హైదారాబాద్ వంటి మహానగరాల్లో ఉన్న ఆప్టికల్ ఫైబర్ ఫర్ హోమ్ పథకాన్ని జిల్లాలోనూ ప్రవేశపెట్టాలని కొంతకాలంగా వినియోగదారులు కోరుతున్నారు. జిల్లాలో ఉన్న అండర్ గ్రౌండ్ కేబుల్స్‌తో ఇంటర్నెట్ వేగం బాగా తగ్గుతోందని దీనికి తోడు అనేక చోట్ల అతుకులుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇప్పటికైనా డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్య కల్పించాలని కోరుతున్నారు. -
బీఎస్ఎన్ఎల్ నుంచి ఉచిత కాల్స్
హైదరాబాద్: దేశంలోని అతి పెద్ద నెట్ వర్క్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్‌తో ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు పలు నెట్ వర్క్‌లు ఎంతోకొంత చెల్లించడంతో సెల్ ఫోన్ ద్వారా రాత్రి వేళలో నాన్ స్టాప్ గా ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం అంతకంటే మించిన పథకాన్ని ప్రారంభించబోతుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు పూర్తి ఉచితంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఫోన్ కాల్ చేసి నిరంతరం మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వనుంది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకాన్ని మే 1 నుంచి ప్రారంభించనుంది. అయితే, ఈ అవకాశం మాత్రం ల్యాండ్ ఫోన్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ప్లాన్స్‌తో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ ఫోన్లు వాడే వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటనలో తెలిపింది. -
హైక్ నుంచి ఉచిత కాల్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ల జాయింట్ వెంచర్, ప్రముఖ మొబైల్ చాట్ అప్లికేషన్, హైక్ మెసెంజర్ ఆంతర్జాతీయంగా ఉన్న తన వినియోగదారులకు ఉచిత కాల్స్‌ను అందించనుంది. ఈ సేవలు యూఎస్‌కు చెందిన జిప్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఒక నెలలోగా అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.తొలిగా ఆండ్రాయిడ్ ఫోన్లలో తర్వాత విండోస్, ఓఎస్ మొబైళ్లలో కూడా ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని హైక్ పేర్కొంది. ‘భారత మార్కెట్ చాలా ఖరీదైన, సున్నితమైంది. డాటా సర్వీసులల్లో మాకు బాగా అనుభవం ఉంది. మా కస్టమర్లు ఒక ఎంబీతో ఎక్కువ నిమిషాలు మాట్లాడుకోవచ్చు. దీనితోపాటు ఉచిత కాల్స్ సర్వీస్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తెస్తున్నాం’ అని హైక్ సీఈఓ కవిన్ మిట్టల్ చెప్పారు.