బేసిక్ ఫోన్లలోనూ జియో ఫ్రీ కాల్స్.. !
• అపరిమిత ఉచిత కాల్స్ ప్యాకేజీకి రిలయన్స్ జియో నిర్ణయం
• మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీకి పలు కంపెనీలతో సంప్రదింపులు...
• ధర రూ.1,000-1,500 ఉండే అవకాశం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెలికం రంగంలో మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది. లైఫ్ బ్రాండ్‌లో 4జీ వారుుస్ ఓవర్ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లను రూ.2,999లకే అందించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఫీచర్ ఫోన్లపై దృష్టిసారించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత డేటా, కాల్స్‌ను ఉచితంగా అందుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనలేని వారు ఈ ఆఫర్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బేసిక్ ఫోన్లనూ వారుుస్ ఓవర్ ఎల్‌టీఈ (వీఓఎల్‌టీఈ) ఉండేలా తెస్తే అన్ని వర్గాలకూ చేరువ కావొచ్చని జియో భావిస్తోంది. దీనికోసం పలు మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. అన్నీ అనుకూలిస్తే నవంబర్లోనే ఇవి మార్కెట్లోకి వచ్చే వీలుంది.
నిమగ్నమైన కంపెనీలు..
వారుుస్ ఓవర్ ఎల్‌టీఈ ఆధారిత ఫీచర్ ఫోన్లను సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెడతామని ముంబైలోని జియో ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫోన్ల సరఫరాకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రసుతం ఈ ఫోన్లను పరీక్షిస్తున్నట్టు కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ వెల్లడించారు. కార్బన్ బ్రాండ్‌లోనే వీటిని విడుదల చేస్తామని, జియో కోరితే లైఫ్ బ్రాండ్‌కూ సరఫరా చేస్తామని చెప్పారు. వీఓఎల్‌టీఈ ఫోన్ల కోసం జియో తమతో చర్చిస్తున్నట్లు ఇన్‌ఫోకస్ నేషనల్ సేల్స్ హెడ్ పియూష్ పురి చెప్పారు. కాగా దీనిపై తామింకా ఏ నిర్ణయం తీసుకోలేదని వీడియోకాన్ మొబైల్స్ సీఈవో జెరాల్డ్ పెరీరా చెప్పారు. భవిష్యత్‌లో సంస్థ తీసుకొచ్చే టెక్నాలజీపై ఇప్పుడే స్పందించలేమంటూ శామ్‌సంగ్ మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ సమాధానం దాటవేశారు.
అపరిమిత కాల్స్..
జియో ఇటీవలే రూ.19 మొదలుకుని రూ.4,999 వరకు గల ధరలో శ్రేణిలో ప్రీ, పోస్ట్ పెరుుడ్ ప్లాన్‌సను ప్రకటించింది. కస్టమర్లు ఏ ప్యాక్ తీసుకున్నా లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌లతోపాటు రోమింగ్ కూడా ఉచితమే. ఇక రిలయన్‌స జియో లైఫ్ ఫీచర్ ఫోన్లు రూ.1,000-1,500 ధరల్లో ఉండొచ్చని సమాచారం. నిజానికి పరిమాణం పరంగా దేశంలో మొబైల్స్ విక్రయాల్లో 54 శాతం వాటా బేసిక్ ఫోన్లదే. ఇవి నెలకు కోటి యూనిట్లు అమ్ముడవుతున్నారుు. జియో వెల్‌కమ్ ఆఫర్‌ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్లకుపైగా కస్టమర్లు తీసుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణ నుంచి 30 లక్షల మంది ఉంటారు.
కాల్స్‌కు డేటా ఖర్చుకాదు: రిలయన్‌స
నిజానికి రిలయన్‌స దేశవ్యాప్తంగా 4జీ లెసైన్‌స మాత్రమే ఉంది. దీంతో వారుుస్ కాల్స్‌ను కూడా అది డేటా ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రీపెరుుడ్ కస్టమర్లు ఏ రూ.149 మంత్లీ ప్యాకేజో తీసుకుంటే... ఆ డేటా మొత్తం కాల్స్‌కే ఖర్చరుుపోతుందిగా? కాల్స్ ఉచితంగా ఇచ్చి లాభమేంటి? అనే సందేహాలున్నారుు. ఇదే విషయాన్ని రిలయన్‌స వర్గాల వద్ద ప్రస్తావించగా... ‘‘కాల్స్‌కు డేటా అస్సలు ఖర్చుకాదు. అందుకే కస్టమర్లు అతి తక్కువ డేటా ప్యాకేజీ తీసుకున్నా అపరిమిత వారుుస్ కాల్స్ చేసుకోవచ్చు’’ అని సమాధానమిచ్చారు. మున్ముందు ఈ టెక్నాలజీ ఎన్ని మార్పులకు కారణమవుతుందో చూడాల్సిందే.