Basic Phone
-
నంబర్ ఇక్కడ..వాట్సాప్ అక్కడ!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో ఉన్న సెల్ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్‌ను తమ స్మార్ట్ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్’పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్‌లు సైబర్ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. ఒకరి పేరుతో ఉన్న సెల్ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్‌ను వినియోగించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్‌కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్‌ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్ ప్రొవైడర్లు ఆ నంబర్‌ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోకున్నా లేదా బేసిక్ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్ నంబర్ పాత యజమాని వద్దే ఉండిపోతోంది. సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. సైబర్ నేరాల కోసం మరొకరి వాట్సాప్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్‌లోని నంబర్లను తమ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకొని వాటిల్లో వాట్సాప్ యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. యాక్టివేట్ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్‌సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్ చేయడంతోనే అవతలి వారి నంబర్‌తో వాట్సాప్ వీరి ఫోన్లలో యాక్టివేట్ అవుతోంది. విషయం ఫోన్‌నంబర్ వాడే వారికి తెలియట్లేదు. కష్టసాధ్యంగా దర్యాప్తు.. ఈ వాట్సాప్‌లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా వారి సంబందీకుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్‌లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్ వోచర్లు డిమాండ్ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది. అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్ యాక్టివేట్ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్లైన్లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది. నేరుగా సంప్రదించడం ఉత్తమం.. వాట్సాప్ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్‌నంబర్ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ -
‘స్పేర్’ ఫోన్ ఉండాల్సిందేనట..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారిలో అత్యధికులు తప్పనిసరిగా మరో స్పేర్ ఫోన్ కలిగి ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఇ–వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ సెరెబ్రా గ్రీన్, మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఎమ్ఎఐటి) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో స్మార్ట్ఫోన్లు వినియోగించే వారిలో 55 శాతం మంది స్పేర్ ఫోన్‌ను కలిగి ఉన్నారని సర్వే తేల్చింది. నగరంలో కొత్త ఫోన్ కొంటున్నవారిలో 9 శాతం మంది మాత్రమే పాత ఫోన్లను రీసైక్లింగ్ చేస్తున్నారని, 20.6 శాతం మంది సరైన ధర రాదనే ఉద్దేశంతో పాత ఫోన్లను విక్రయించడం పట్ల ఆసక్తి చూపడం లేదని సర్వే వెల్లడించింది. అయితే ఈ–వేస్ట్‌ను తగ్గించే క్రమంలో ఫోన్లను రీసైక్లింగ్‌కి ఇవ్వడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని 65 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకి అవగాహన ఉందని కూడా సర్వేతేల్చడం విశేషం. -
స్మార్ట్ఫోన్లు ఇక తప్పనిసరి!!
• ‘బిగ్ సి’ ఫౌండర్ బాలు చౌదరి • అందరూ ఇవే అడుగుతున్నారు • డిజిటల్ పేమెంట్లే దీనికి కారణం • బేసిక్ ఫోన్ల అమ్మకాలు తగ్గాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో స్మార్ట్‌ఫోన్ అంటే గతంలో ఫ్యాన్సీ. ఇపుడైతే తప్పనిసరి వినియోగ వస్తువుల జాబితాలో చేరిపోయిందని మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ చెబుతోంది. పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం ప్రోత్సహించడమే దీనికి కారణమని సంస్థ వ్యవస్థాపకుడు ఎం.బాలు చౌదరి చెప్పారు. ఫీచర్ ఫోన్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లవైపు మళ్లుతున్నారని చెప్పారాయన. బిగ్ సి 14 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ... అమ్మకాలెలా ఉన్నాయ్? నోట్ల రద్దు ప్రభావం ఉందా? నవంబర్ 8 వరకూ బిగ్ సి స్టోర్లలో నగదు లావాదేవీల వాటా ఏకంగా 52 శాతం ఉండేది. పెద్ద నోట్ల రద్దుతో ఇపుడది 10 శాతానికి పరిమితమైంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం ఒక్కసారిగా పెరిగింది. కార్డు చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించాం. అన్ని బ్యాంకుల సహకారంతో దీన్ని అమలు చేస్తున్నాం. నవంబరు 9 నుంచి వారం రోజులు మాత్రం అమ్మకాల్లో ఏకంగా 60శాతం తగ్గుదల కనిపించింది. డిసెంబర్ నుంచి అమ్మకాలు మళ్లీ గాడిలో పడ్డాయి. డిజిటల్ రూపంలో నగదు స్వీకరించాలన్నా, చెల్లించాలన్నా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండితీరాలి. చిన్న చిన్న వర్తకులు కూడా డిజిటల్ పేమెంట్లకు ఓకే అంటున్నారు. నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ల రంగంలో కొత్త అవకాశాలొస్తున్నాయి. ఇవి పెరుగుతున్నాయంటే ఫీచర్ ఫోన్ల విక్రయాలు తగ్గి ఉండాలిగా? నిజమే! మూడేళ్ల కిందట మా అమ్మకాల్లో ఫీచర్ ఫోన్ల వాటా 55 శాతం. రెండు నెలల కిందటి వరకూ 50 శాతంగా ఉండేది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత నెల రోజుల్లోనే ఈ వాటా 40 శాతానికి తగ్గిపోయింది. కస్టమర్లు స్మార్ట్ఫోన్లవైపు మొగ్గటమే దీనికి కారణం. మరోవైపు సగటు స్మార్ట్‌ఫోన్ విక్రయ ధర రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో రూ.3–12 వేల ధరల శ్రేణి సింహ భాగం కైవసం చేసుకుంది. టెలికం కంపెనీల పోటీతో డేటా చార్జీలు దిగిరావడం, రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ కూడా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరగటానికి కారణమయ్యాయి. అమ్ముడు పోతున్నవన్నీ 4జీ ఫోన్లే. మరి ఆన్లైన్లో కూడా ఫోన్లు చౌకగా దొరుకుతున్నాయి కదా? అదేం లేదు. ఫండింగ్ వచ్చినంత కాలం ఈ–కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. నిధుల రాక ఆగిపోవడం, ప్రభుత్వ నియంత్రణలతో ఇప్పుడివి డిస్కౌంట్లను మానేశాయి. వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతూ ఉండటంతో... ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్‌లోనే ఉత్పత్తుల ధర తక్కువగా ఉంది. అందుకే కస్టమర్లు స్టోర్లకు వస్తున్నారు. ఏ కారణాలతో ఇంత వృద్ధి సాధ్యమైందని భావిస్తున్నారు? మా సిబ్బందిని, కస్టమర్లను ఇద్దరినీ గుర్తించడమే మా విజయానికి మూలం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టోర్ మేనేజర్లను ఈ మధ్య బ్యాంకాక్‌లో సన్మానించాం. స్టోర్ మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని విదేశాలకు తీసుకు వెళ్లడమనేది దేశీ రిటైల్‌లో ఇదే తొలిసారి. ఇక కస్టమర్లకు బహుమతులందించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి దసరావళి విక్రయాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేశాం. -
బేసిక్ ఫోన్లలోనూ జియో ఫ్రీ కాల్స్.. !
• అపరిమిత ఉచిత కాల్స్ ప్యాకేజీకి రిలయన్స్ జియో నిర్ణయం • మొబైల్ హ్యాండ్సెట్ల తయారీకి పలు కంపెనీలతో సంప్రదింపులు... • ధర రూ.1,000-1,500 ఉండే అవకాశం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెలికం రంగంలో మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది. లైఫ్ బ్రాండ్‌లో 4జీ వారుుస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లను రూ.2,999లకే అందించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఫీచర్ ఫోన్లపై దృష్టిసారించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే జియో వెల్కమ్ ఆఫర్‌తో అపరిమిత డేటా, కాల్స్‌ను ఉచితంగా అందుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనలేని వారు ఈ ఆఫర్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బేసిక్ ఫోన్లనూ వారుుస్ ఓవర్ ఎల్టీఈ (వీఓఎల్టీఈ) ఉండేలా తెస్తే అన్ని వర్గాలకూ చేరువ కావొచ్చని జియో భావిస్తోంది. దీనికోసం పలు మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. అన్నీ అనుకూలిస్తే నవంబర్లోనే ఇవి మార్కెట్లోకి వచ్చే వీలుంది. నిమగ్నమైన కంపెనీలు.. వారుుస్ ఓవర్ ఎల్టీఈ ఆధారిత ఫీచర్ ఫోన్లను సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెడతామని ముంబైలోని జియో ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫోన్ల సరఫరాకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రసుతం ఈ ఫోన్లను పరీక్షిస్తున్నట్టు కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ వెల్లడించారు. కార్బన్ బ్రాండ్‌లోనే వీటిని విడుదల చేస్తామని, జియో కోరితే లైఫ్ బ్రాండ్‌కూ సరఫరా చేస్తామని చెప్పారు. వీఓఎల్టీఈ ఫోన్ల కోసం జియో తమతో చర్చిస్తున్నట్లు ఇన్ఫోకస్ నేషనల్ సేల్స్ హెడ్ పియూష్ పురి చెప్పారు. కాగా దీనిపై తామింకా ఏ నిర్ణయం తీసుకోలేదని వీడియోకాన్ మొబైల్స్ సీఈవో జెరాల్డ్ పెరీరా చెప్పారు. భవిష్యత్‌లో సంస్థ తీసుకొచ్చే టెక్నాలజీపై ఇప్పుడే స్పందించలేమంటూ శామ్సంగ్ మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ సమాధానం దాటవేశారు. అపరిమిత కాల్స్.. జియో ఇటీవలే రూ.19 మొదలుకుని రూ.4,999 వరకు గల ధరలో శ్రేణిలో ప్రీ, పోస్ట్ పెరుుడ్ ప్లాన్సను ప్రకటించింది. కస్టమర్లు ఏ ప్యాక్ తీసుకున్నా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్లతోపాటు రోమింగ్ కూడా ఉచితమే. ఇక రిలయన్స జియో లైఫ్ ఫీచర్ ఫోన్లు రూ.1,000-1,500 ధరల్లో ఉండొచ్చని సమాచారం. నిజానికి పరిమాణం పరంగా దేశంలో మొబైల్స్ విక్రయాల్లో 54 శాతం వాటా బేసిక్ ఫోన్లదే. ఇవి నెలకు కోటి యూనిట్లు అమ్ముడవుతున్నారుు. జియో వెల్కమ్ ఆఫర్‌ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్లకుపైగా కస్టమర్లు తీసుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణ నుంచి 30 లక్షల మంది ఉంటారు. కాల్స్‌కు డేటా ఖర్చుకాదు: రిలయన్స నిజానికి రిలయన్స దేశవ్యాప్తంగా 4జీ లెసైన్‌స మాత్రమే ఉంది. దీంతో వారుుస్ కాల్స్‌ను కూడా అది డేటా ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రీపెరుుడ్ కస్టమర్లు ఏ రూ.149 మంత్లీ ప్యాకేజో తీసుకుంటే... ఆ డేటా మొత్తం కాల్స్‌కే ఖర్చరుుపోతుందిగా? కాల్స్ ఉచితంగా ఇచ్చి లాభమేంటి? అనే సందేహాలున్నారుు. ఇదే విషయాన్ని రిలయన్స వర్గాల వద్ద ప్రస్తావించగా... ‘‘కాల్స్‌కు డేటా అస్సలు ఖర్చుకాదు. అందుకే కస్టమర్లు అతి తక్కువ డేటా ప్యాకేజీ తీసుకున్నా అపరిమిత వారుుస్ కాల్స్ చేసుకోవచ్చు’’ అని సమాధానమిచ్చారు. మున్ముందు ఈ టెక్నాలజీ ఎన్ని మార్పులకు కారణమవుతుందో చూడాల్సిందే.