బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత కాల్స్
కోల్‌కత్తా : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ఆదివారం ల్యాండ్‌లైన్లకు అందిస్తున్న ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను ఫిబ్రవరి 1 నుంచి రద్దు చేయబోతుంది. రాత్రిపూట అందించే ఉచిత కాలింగ్ ప్రయోజనాలను నిరోధించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రకటన చేసింది. ''ఫిబ్రవరి నుంచి ఆదివారం ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని విత్‌డ్రా చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. కానీ కలకత్తా టెలిఫోన్స్ నుంచి, మా వినియోగదారులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రణాళికలపై పని చేస్తున్నాం'' అని కోల్‌కత్తా టెలిఫోన్స్(కాల్‌టెల్) చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్‌పీ తిరపతి చెప్పారు.
వారంలో సాధారణ రోజుల మాదిరిగా.. ల్యాండ్‌లైన్, కోంబో, ఎఫ్‌టీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై ఆదివారం రోజూ కస్టమర్లకు ఛార్జీలు విధించనున్నామని తెలిపారు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. జనవరి మధ్యలోనే రాత్రిపూట ఆఫర్ చేసే కాలింగ్ స్కీమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ సమీక్షించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటల నుంచి ఉచిత కాల్స్ ఆఫర్ చేసే బదులు రాత్రి 10.30 గంటల నుంచి ఆఫర్ చేయడం ప్రారంభించిందని కాల్‌టెల్ టెక్నికల్ సెక్రటరీ సీజీఎం గౌతమ్ చక్రబోర్టి చెప్పారు. 2016 ఆగస్టు 21న ఆదివారం ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని, రాత్రి ఉచిత కాలింగ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment