
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల స్పీడ్ కొంత తగ్గింది. జూలైలో 4.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జూలైతో పోల్చితే 2018 జూలైలో రిటైల్ వస్తువుల బాస్కెట్ ధర కేవలం 4.17 శాతమే పెరిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో ధరల పెరుగుదల రేటు నమోదుకావడం తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారి. కూరగాయల ధరలు తగ్గడం ఇందుకు ఒక కారణం.
కాగా గత ఏడాది జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతంకాగా, ఈ ఏడాది జూన్ నెలలో రేటు 4.85 శాతం. కాగా ఫుడ్ అండ్ శీతల పానీయాల ధరల పెరుగుదల రేటు 1.73 శాతం. ఇందులో కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా –2.19 శాతం తగ్గాయి. పప్పు దినుసులు (–8.91 శాతం), చక్కెర (–5.81 శాతం) ధరలదీ ఇదే ధోరణి. గుడ్లు 7.41 శాతం, పండ్లు (6.98 శాతం, చేపలు 2.26 శాతం పెరిగాయి.