ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు.. | Retail investors Can Access Government Securities Market From August 16: RBI | Sakshi
Sakshi News home page

ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు..

Published Fri, Jul 29 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు..

ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు..

జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులోకి
ముంబై: గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ-సెక్యూరిటీస్) మార్కెట్ ఆగస్టు 16 నుంచీ  రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.  బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు మాత్రమే ప్రస్తుతం జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులో ఉంది.

ఆగస్టు 16 నుంచీ ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమతమ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)కి సంబంధించి ఎన్‌డీఎస్-ఓఎం ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. డీమ్యాట్ అకౌంట్ దారుడు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ట్రేడింగ్ చేయడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సూచించినట్లూ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement