ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు కొనొచ్చు..
జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులోకి
ముంబై: గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ-సెక్యూరిటీస్) మార్కెట్ ఆగస్టు 16 నుంచీ రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే ప్రస్తుతం జీ-సెక్యూరిటీస్ మార్కెట్ అందుబాటులో ఉంది.
ఆగస్టు 16 నుంచీ ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమతమ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)కి సంబంధించి ఎన్డీఎస్-ఓఎం ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. డీమ్యాట్ అకౌంట్ దారుడు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ట్రేడింగ్ చేయడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సూచించినట్లూ వివరించింది.