పీఎన్‌సీ ఇన్‌ఫ్రా పబ్లిక్ ఇష్యూ | Retainer fees rise for PNC board | Sakshi
Sakshi News home page

పీఎన్‌సీ ఇన్‌ఫ్రా పబ్లిక్ ఇష్యూ

Published Wed, May 6 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

పీఎన్‌సీ ఇన్‌ఫ్రా పబ్లిక్ ఇష్యూ

పీఎన్‌సీ ఇన్‌ఫ్రా పబ్లిక్ ఇష్యూ

ప్రైస్ బ్రాండ్ ధర రూ. 355-378
ఈనెల 8-12 వరకూ ఆఫర్...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోడ్లు, ఎయిర్‌పోర్ట్ రన్‌వేల నిర్మాణ సంస్థ అయిన పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్.. రూ.488 కోట్ల మేర నిధులు సమీకరించడానికి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ఈ నెల 8న ప్రారంభమై 12న ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.355-378 ప్రైస్‌బ్యాండ్‌లో కంపెనీ విక్రయానికి పెట్టింది. ప్రస్తుతం పీఎన్‌సీ సంస్థ చేతిలో దేశవ్యాప్తంగా 42 ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లున్నాయి.

2013-14లో కంపెనీ రూ. 6,085 కోట్ల విలువైన కాంట్రాక్టులను చేజిక్కించుకోగా... 2014-15 కంపెనీ ఆర్డర్‌బుక్ 7,849 కోట్ల రూపాయలకు చేరింది. వచ్చే రెండేళ్లలో నిర్మాణ రంగం 22 శాతం వృద్ధి రేటుతో రూ.12.86 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇన్‌ఫ్రా కంపెనీలకు అద్భుతమైన అవకాశాలున్నాయని కంపెనీ ఈ సందర్భంగా తెలియజేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement