PNC Infratech Ltd
-
ఆర్డర్లే ఆర్డర్లు- ఈ షేర్లకు భలే జోష్
ముంబై, సాక్షి: ఒక్కరోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 234 పాయింట్లు ఎగసి 46,194 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు ఎగసి 13,546కు చేరింది. వెరసి మార్కెట్లు మళ్లీ రికార్డుల ర్యాలీ బాట పట్టాయి. కాగా.. ఆర్థిక రికవరీ పరిస్థితులు నెలకొనడంతో పలు కంపెనీలు ఆర్డర్లు, కాంట్రాక్టులను దక్కించుకుంటున్నాయి. తాజాగా ఇర్కాన్ ఇంటర్నేషనల్, గాయత్రి ప్రాజెక్ట్స్, ఇండియన్ హ్యూమ్‌పైప్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా ఈ జాబితాలో చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) ఆర్డర్ల బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ.. ఇర్కాన్ ఇంటర్నేషనల్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి రూ. 900 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది. దీనిలో భాగంగా గుర్గావ్- పటౌడీ- రేవారీ సెక్షన్లో అప్‌గ్రేడ్ పనులు చేపట్టవలసి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇర్కాన్ షేరు ఎన్ఎస్ఈలో 5.6 శాతం జంప్‌చేసి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96కు చేరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇండియన్ హ్యూమ్ పైప్ రూ. 550 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది. 21 నెలలో పూర్తిచేయవలసిన ఆర్డర్లో భాగంగా కాన్పూర్ డివిజన్లోని 550 గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండియన్ హ్యూమ్ పైప్స్ షేరు 6 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. (ర్యాలీ షురూ- 46,000 ఎగువకు సెన్సెక్స్) అప్పర్ సర్క్యూట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు రూ. 1,332 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ తెలియజేసింది. భాగస్వామ్య సంస్థ ద్వారా సాధించిన ఈ ప్రాజెక్టులో 97.5 శాతం వాటా తమకున్నట్లు వెల్లడించింది. దీంతో్ గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 36.35 వద్ద ఫ్రీజయ్యింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య సంస్థ ద్వారా పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా రూ. 952 కోట్ల విలువైన కాంట్రాక్టును సొంతం చేసుకున్నాయి. నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాలలో భాగంగా 952 గ్రామాలకు 10ఏళ్లపాటు నీటి సరఫరా సంబంధ పనులను నిర్వహించవలసి ఉన్నట్లు జేవీ తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్పీఎంఎల్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 13.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇక పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ 3.5 శాతం పెరిగి రూ. 182 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ జంప్‌చేసింది. -
ఎంఫసిస్- పీఎన్సీ ఇన్ఫ్రా.. ధూమ్‌ధామ్
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎంఫసిస్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు రెండు ఈపీసీ ప్రాజెక్టులను గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎంఫసిస్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఫసిస్ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 275 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 11 శాతం వృద్ధితో రూ. 2,288 కోట్లను తాకింది. విదేశీ మార్కెట్ల నుంచి క్యూ1లో 25.9 కోట్ల డాలర్ల(రూ. 1940 కోట్లు) విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ తెలియజేసింది. దీనికితోడు జులైలో తాజాగా 21.6 కోట్ల కొత్త డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎంఫసిస్ షేరు 11.4 శాతం దూసుకెళ్లి రూ. 1091 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1098 వరకూ ఎగసింది. గత మూడు నెలల్లో ఈ షేరు 55 శాతం ర్యాలీ చేయడం విశేషం! పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి రెండు ఈపీసీ ప్రాజెక్టులను పొందినట్లు పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తాజాగా పేర్కొంది. భారత్‌మాల పరియోజనలో భాగంగా వీటి సంయుక్త విలువ రూ. 1548 కోట్లుకాగా.. రెండేళ్లలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాతోపాటు.. వడోదర జిల్లాలోనూ 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికిగాను లభించిన ఈ ఆర్డర్ల విలువను రూ. 758.5 కోట్లు, రూ. 789.5 కోట్లుగా వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 149 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 152ను సైతం అధిగమించింది. -
క్యామ్లిన్- పీఎన్సీ.. భలే దూకుడు
రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగసి 35,013కు చేరింది. తద్వారా 35,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 10,348 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, మరోపక్క పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ప్రతిపాదిత నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 180 కోట్లను సమీకరించనున్నట్లు తెలియజేసింది. నిధులను మెక్సికో, చైనాలలో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థల(జేవీలు)లో పూర్తి వాటాలను సొంతం చేసుకునేందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 5 పెరిగి రూ. 53.6 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 57 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ జాతీయ రహదారుల అధీకృత సంస్థ(NHAI) నుంచి రూ. 1412 కోట్ల కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ వెల్లడించింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి నజీబాబాద్ వరకూ 54 కిలోమీటర్లమేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని తెలియజేసింది. భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి(HAM)లో సాధించిన ఈ ఆర్డర్‌ను 24 నెలల్లోగా పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 13 జమ చేసుకుని రూ. 146 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 152 వరకూ ఎగసింది. -
పీఎన్సీ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ
ప్రైస్ బ్రాండ్ ధర రూ. 355-378 ⇒ ఈనెల 8-12 వరకూ ఆఫర్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోడ్లు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణ సంస్థ అయిన పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్.. రూ.488 కోట్ల మేర నిధులు సమీకరించడానికి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ఈ నెల 8న ప్రారంభమై 12న ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.355-378 ప్రైస్‌బ్యాండ్‌లో కంపెనీ విక్రయానికి పెట్టింది. ప్రస్తుతం పీఎన్సీ సంస్థ చేతిలో దేశవ్యాప్తంగా 42 ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లున్నాయి. 2013-14లో కంపెనీ రూ. 6,085 కోట్ల విలువైన కాంట్రాక్టులను చేజిక్కించుకోగా... 2014-15 కంపెనీ ఆర్డర్‌బుక్ 7,849 కోట్ల రూపాయలకు చేరింది. వచ్చే రెండేళ్లలో నిర్మాణ రంగం 22 శాతం వృద్ధి రేటుతో రూ.12.86 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇన్ఫ్రా కంపెనీలకు అద్భుతమైన అవకాశాలున్నాయని కంపెనీ ఈ సందర్భంగా తెలియజేసింది.