రూ.1,000 నోట్లా .. ఆ ప్రతిపాదనేమీ లేదు...
న్యూఢిల్లీ: రూమర్లకు చెక్ పెడుతూ ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా రూ.1,000 నోట్లను తిరిగి చలామణిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనేమీలేదని స్పష్టంచేసింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ రూ. 1,000 నోట్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, రూ. 1,000 నోట్లను మళ్లీ తీసుకువచ్చే ప్రతిపాదనేమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు.
నల్లధనానికి చెక్ చెప్పడం కోసం గతేడాది మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా రూ.500 నోట్లను, 2,000 నోట్లను తెచ్చింది. తాజాగా రూ.200 నోట్లను కూడా చెలామణిలోకి తీసుకువచ్చింది. అలాగే త్వరలో కొత్త రూ.50 నోట్లను కూడా తీసుకువస్తోంది.