ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్‌ | Rs 389-crore dam collapses in Bihar a day ahead of inauguration | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్‌

Published Wed, Sep 20 2017 10:37 AM | Last Updated on Wed, Sep 20 2017 11:53 AM

ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్‌

ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్‌

భాగల్పూర్ : నీటిపారుదల స్కీమ్‌ కింద చేపట్టిన కెనాల్‌ ప్రాజెక్టు డ్యామ్‌ ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. మరో 24 గంటల్లో సీఎం ఈ డ్యామ్‌ను ప్రారంభం చేస్తారనగా ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లోని భాగల్పూర్‌లో కహల్‌గావ్‌ వద్ద ఇరిగేషన్‌ స్కీమ్‌ కింద బతేశ్వర్‌ పంత్‌  కెనాల్ ప్రాజెక్ట్ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మించడానికి ప్రభుత్వం రూ.389.31 కోట్లను ఖర్చుచేసింది. మరో 24 గంటల్లో ఆ ఆనకట్టను ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. కానీ ప్రారంభానికి కంటే ముందస్తుగానే ఈ ఆనకట్ట కుప్పకూలిపోయింది. పూర్తి సామర్థ్యంలో నీటి విడుదల కారణంగా ఈ ఆనకట్టు కూలిపోయిందని ఆ రాష్ట్ర నీటివనరుల మంత్రి లలాన్‌సింగ్‌ చెబుతున్నారు.
 
ఈ అనుకోని సంఘటన వల్ల ఆనకట్టు ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆనకట్ట ముఖ్య ఉద్దేశ్యం కెనాల్‌లో నీటిని సేకరించి, వ్యవసాయదారులకు నీరు అందించడం. వ్యవసాయదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొనకూడదని ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టు కూలిపోవడంతో, లోతట్టు ప్రాంతాల్లో చాలా గృహాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భాగల్పూర్‌లో 18620 హెక్టార్‌లలో, జార్ఖాండ్‌లోని గోడ జిల్లాలో 22658 హెక్టార్లలో నీటి పారుదల సౌకర్యం కల్పించనున్నారు.  ఈ ప్రాజెక్టును నిర్మించడానికి, పూర్తిచేయడానికి ప్రభుత్వానికి చాలా కాలం పట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement