
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇటీవల రికవరీతో రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న దేశీ కరెన్సీ... బ్యాంకుల నుంచి, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడం కారణంగా బుధవారం ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు నష్టపోయింది. 68.62 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజు రూపాయి 68.45 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే.
చమురు ధరలు కొన్ని నెలల కనిష్టానికి చేరినప్పటికీ రూపాయి విలువ క్షీణించడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగ భవిష్యత్తుపై ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ వ్యాఖ్యలతో మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు జీవం పోసింది. దీంతో డాలర్ ఇండెక్స్ మరి కాస్త బలోపేతం అయింది
Comments
Please login to add a commentAdd a comment