
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్ ధోరణి కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం లాభాలతో ముగిసిన రూపాయి నేడు మరింత పుంజుకుంది. 21 పైసలు ఎగిసి 70.64 వద్ద కొనసాగుతోంది. అటు స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకుని 158 పాయింట్లుపైగా ఎగిసిన సెన్సెక్స్ 40570 స్థాయి వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్లు పుంజుకుని 11956 పాయింట్లను అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment