రెండు కంపెనీలుగా శాంసంగ్!
సియోల్: ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది.
అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం ఉన్న స్వతంత్ర బోర్డు సభ్యుడు ఒక్కరినైనా నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. షేర్‌హోల్డర్లకు డివిడెండ్ చెల్లింపులను గతేడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా 3.4 బిలియన్ డాలర్ల మేర చెల్లించనున్నట్లు శాంసంగ్ తెలిపింది. ఒక వైపు లోపభూరుుష్టమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలిపోరుున ఉదంతాలు, మరోవైపు దేశీయంగా రాజకీయ వివాదాలు శాంసంగ్‌ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ను స్థాపించిన లీ కుటుంబ వారసుడు, వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు అధికారాలు బదలారుుంచే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.