holding company
-
హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) క్రమంగా హోల్డింగ్ కంపెనీగా ఆవిర్భవించే అవకాశమున్నట్లు ఫిన్‌టెక్ గ్రూప్ క్రెడిట్‌సైట్స్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రధాన బిజినెస్ విభాగాల్లో స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా నిలిచే వీలున్నట్లు అంచనా వేసింది. ఆర్ఐఎల్ విషయంలో కంపెనీ చీఫ్ బిలియనీర్ ముకేశ్ అంబానీ అమలు చేస్తున్న విజయవంతమైన ప్రణాళికల ద్వారా పటిష్ట క్రెడిట్ ప్రొఫైల్‌ను సొంతం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. టెలికం, రిటైల్ విభాగాలు అత్యుత్తమ ఫలితాలు సాధించనుండటంతో చమురు విభాగం బలహీన ఔట్లుక్ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది. అధిక ధరల నేపథ్యంలో చమురుశుద్ధి యూనిట్, భారీ పెట్టుబడి అవసరాలు వంటి అంశాలు చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఇటీవల ఆర్ఐఎల్ వివిధ బిజినెస్‌ల విజయవంతమయ్యే ప్రణాళికలపైనే దృష్టి సారించింది. చైర్మన్ ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం ఆకాశ్, ఈషా, అనంత్‌లను సంస్థ బోర్డులో డైరెక్టర్లుగా చోటు కల్పించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ‘పలువురు ఇన్వెస్టర్లకు ముకేశ్ అంబానీ బాధ్యతల నుంచి వైదొలగే అంశంపై ఆందోళనలు నెలకొని ఉండవచ్చు. అయితే ముకేశ్ అంబానీ విజయవంతమైన ప్రణాళికలను సానుకూలంగా పరిగణించాలి. ముగ్గురికీ ఆర్ఐఎల్ ప్రధాన బిజినెస్ యూనిట్ల (టెలికం, రిటైల్, నూతన ఇంధన) యాజమాన్య బాధ్యతలను అప్పగించారు. తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా స్పష్టమైన విభజనను చేపట్టారం’టూ క్రెడిట్‌సైట్స్ నివేదికలో వివరించింది. దీంతో ముకేశ్ ఉన్నట్లుండి బాధ్యతల నుంచి తప్పుకోవడం అనే రిస్కుకు చెక్ పెట్టారని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి తరం యాజమాన్య నిర్వహణలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మరింత అభివృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి ప్రధాన బిజినెస్ విభాగాలు స్వతంత్రంగా ఎదిగేందుకు దారి చూపుతూ హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్ ఆవిర్భవించనున్నట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్‌కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
రెండు కంపెనీలుగా శాంసంగ్!
సియోల్: ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది. అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం ఉన్న స్వతంత్ర బోర్డు సభ్యుడు ఒక్కరినైనా నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. షేర్హోల్డర్లకు డివిడెండ్ చెల్లింపులను గతేడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా 3.4 బిలియన్ డాలర్ల మేర చెల్లించనున్నట్లు శాంసంగ్ తెలిపింది. ఒక వైపు లోపభూరుుష్టమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలిపోరుున ఉదంతాలు, మరోవైపు దేశీయంగా రాజకీయ వివాదాలు శాంసంగ్‌ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ను స్థాపించిన లీ కుటుంబ వారసుడు, వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు అధికారాలు బదలారుుంచే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.