
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స దిగ్గజం శాంసంగ్ దూకుడుగా ఉంది. 5జీ ఫోన్‌ను వచ్చే నెలలోనే లాంచ్ చేయనుందని స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా మార్కెట్లో యాపిల్‌పై పైచేయి సాధించేందుకు సన్నద్ధమవుతోంది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్ 10’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సౌత్ కొరియాలో లాంచ్ చేయనుంది. ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్‌గా దీన్ని ఏప్రిల్ 5న ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి సిగ్నల్ వెరిఫికేషన్ పరీక్షలో గ్రీన్ సిగ్నల్ కూడా సాధించింది. ఆ రోజునుంచే సేల్స్ కూడా మొదలవుతాయట. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రూ.91300గా నిర్ణయించవచ్చని పరిశ‍్రమ వర్గాల అంచనా.
శాంసంగ్ ఎస్10 5జీ
6.70 ఇంచెస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9.0
12+12+16+0.038 ఎంపీ రియల్ కెమెరా
100.038 ఎంపీ సెల్ఫీకెమెరా
8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment