డిపాజిట్ కట్టకుంటే ఆంబీ వేలం తప్పదు
సహారా గ్రూప్‌నకు సుప్రీంకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఈ నెల 17లోగా సెబీ–సహారా రీఫండ్ అకౌంట్లో రూ. 5,092.6 కోట్లు జమ చేయాల్సిందేనని, ఇందుకు సంబం ధించి గడువు పొడిగించే ప్రసక్తే లేదని సహారా గ్రూప్‌నకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో దాదాపు రూ. 39,000 కోట్లు విలువ చేసే సహారా గ్రూప్ ప్రాజెక్టు ‘ఆంబీ వ్యాలీ’ని వేలం వేయాలంటూ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించింది.
సెబీ–సహారా రీఫండ్ ఖాతాలో నగదు జమ చేసేందుకు గడువు పొడిగించాలని అభ్యర్ధిస్తూ సహారా గ్రూప్ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లు తిరిగివ్వాల్సిన కేసుపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.