రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు: సహారా | 32 crores investments : sahara | Sakshi
Sakshi News home page

రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు: సహారా

Published Mon, Feb 3 2014 12:36 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

రూ. 32 వేల కోట్ల  పెట్టుబడులు: సహారా - Sakshi

 న్యూఢిల్లీ: సెబీతో సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న సహారా గ్రూప్ ఆశ్చర్యకరంగా 56 వేల కొత్త ఉద్యోగాలిస్తున్నట్లు పేర్కొం ది. రూ.32,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించింది. దేశ, విదేశాల్లో ఈ ఏడాదిలోనే ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, డెయిరీ, పౌల్ట్రీ, లగ్జరీ రియల్టీ, లైఫ్‌స్టైల్, ఫుడ్ ఫ్యాక్టరీ, లో కాస్ట్ హౌజింగ్, విద్యా, నౌకాయానం తదితర రంగాల్లో  56 వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ ప్రకటనల్లో సహారా పేర్కొంది. మూడేళ్లలో 4 లక్షల ఉద్యోగాలిస్తామని సహారా వివరించింది. ఇన్వెస్టర్లకు రూ.20,000 కోట్ల రీఫండ్ విషయమై సెబీ, సహారాల మధ్య న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement