న్యూఢిల్లీ: గ్లోబల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్.. తాజాగా బెంగళూరులో స్మార్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిశ్రమలకు అవసరమైన యూపీఎస్ సిస్టమ్స్, విద్యుత్ మోటారు భ్రమణ వేగాన్ని నియంత్రించే వేరియబుల్ స్పీడ్ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. నూతన ప్లాంట్ కోసం 700 మందిని నియమించుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో ఈ సంస్థ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2020 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 100 స్మార్ట్ ఫ్యాక్టరీలను ప్రారంభించాలని లక్ష్యంగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment