నల్లధనంపై సెబీ యుద్ధం
59 సంస్థలపై నిషేధ
న్యూఢిల్లీ : పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్‌ఎన్‌ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. బీఎస్‌ఈలో స్టాక్ ఆప్షన్ల ద్వారా కొన్ని సంస్థలు ఎప్పుడూ నష్టాలను, మరికొన్ని ఎప్పుడూ లాభాలను గడిస్తున్నట్లు సెబీ గుర్తించింది.
ఇది ఏవిధంగా జరుగుతోంది తెలపాలని సెబీ ఆ సంస్థలను కోరినప్పుడు అవి సరైన సమాధానం ఇవ్వలే దు. దీంతో సెబీ వాటిపై నిషేధం విధించింది. సెబీ గతంలో దాదాపు 950 సంస్థలను నిషేధించింది.