HNI
-
ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్లో వాటాలను విక్రయించాలని విదేశీ పెట్టుబడి సంస్థలు యోచిస్తున్నాయి. ప్రధానంగా జనరల్ అట్లాంటిక్ సింగపూర్, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటాలను ఆఫర్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్‌లో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌కు 13.6 శాతం వాటా ఉంది. అయితే మార్కెట్ ధర కంటే అధికంగా సుమారు 40 శాతంవరకూ ప్రీమియంను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాటాల కొనుగోలుకి పీఈ ఫండ్స్, సంపన్న వర్గాలు (హెచ్ఎన్ఐలు) ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నాయి. పీఈ సంస్థ ద క్యాపిటల్ ఫండ్ సైతం రేసులో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో షేరుకి రూ. 2,100 ధరవరకూ ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. బుధవారం బీఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,474 వద్ద ముగిసింది. కాగా.. వాటా విక్రయం అంశంపై ఐఐఎఫ్ఎల్ వెల్త్సహా జనరల్ అట్లాంటిక్, ఫెయిర్‌ఫాక్స్ స్పందించకపోవడం గమనార్హం! 2008లో షురూ కొటక్ వెల్త్ ఉద్యోగులు కరణ్ భగత్, యతిన్ షా సహకారంతో 2008లో నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ వెల్త్‌ను ఏర్పాటు చేశారు. 2015 అక్టోబర్‌లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ 21.6 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,122 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అయితే అప్పటికి ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ పేరుతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2019లో విలువ జోడింపునకు వీలుగా ఐఐఎఫ్ఎల్.. ఫైనాన్స్, వెల్త్, సెక్యూరిటీస్ పేరుతో మూడు కంపెనీలుగా విడదీసి లిస్టింగ్ చేసింది. కాగా.. 44 బిలియన్ డాలర్ల ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద స్వతంత్ర వెల్త్ మేనేజర్ కంపెనీగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ నిలుస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
ఫండ్స్ లోకి 1.5 లక్షల కోట్లు!
భారీగా నిధులు వస్తాయని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అంచనా... న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు చర్య(డీమోనిటైజేషన్) ప్రభావంతో ఫండ్స్ ఇతరత్రా ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులు పోటెత్తనున్నాయని మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) పరిశ్రమ భావిస్తోంది. మధ్యాకాలానికి రిటైల్, హైనెట్వర్త్ ఇన్వెస్టర్ల(హెచ్ఎన్ఐలు) నుంచి ఫండ్సలోకి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల భారీ నిధులు రావచ్చనేది పరిశ్రమ నిపుణుల అంచనా. అంతేకాకుండా.. రానున్న కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆదాయం పుంజుకోవడం, వడ్డీరేట్ల కోత వంటివి చోటుచేసుకోనున్నాయని వారు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటివాటిలో పెట్టుబడులపై దృష్టిసారించనున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ‘డీమోనిటైజేషన్ వ్యవధి తర్వాత 2-3 క్వార్టర్ల పాటు సర్దుబాట్లు ఉండొచ్చు. ఆతర్వాత స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తాయని(అత్యంత బుల్లిష్ ధోరణి) భావిస్తున్నాం. ప్రధానంగా బ్లాక్ మనీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బంగారం, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులకు వెనకాడే పరిస్థితులు ఉన్నారుు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ప్రయోజనం లభించనుంది. వచ్చే మూడేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ రెట్టింపు కావచ్చనేది మా అంచనా’ అని మోతీలాల్ ఓశ్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఎండీ, సీఈఓ ఆశిష్ సోమయా పేర్కొన్నారు. ‘మొత్తం ఆర్థిక పొదుపు సాధనాల్లో దాదాపు 9 శాతం నగదు రూపంలో(కరెన్సీ నోట్లు) ఉంటాయని అంచనా. క్యాపిటల్ మార్కెట్ అసెట్స్‌లో ఇది 6 శాతమే. ఇప్పుడు డీమోనిటైజేషన్ కారణంగా బంగారం, రియల్టీ ఇతరత్రా సాంప్రదాయ పెట్టుబడులతో పాటు నగదు లావాదేవీలు కూడా తగ్గుముఖం పట్టొచ్చు. దీంతో పెద్ద మొత్తంలో నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నాం’ అని డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఏఎంసీ సీఐఓ(ఈక్విటీస్) ఈఏ సుందరం వ్యాఖ్యానించారు. 2015 మార్చి నాటికి బ్యాంకుల్లో వ్యక్తిగత డిపాజిట్ల(కార్పొరేట్లు, ఇతరత్రా సంస్థలు కాకుండా) విలువ దాదాపు రూ.50.6 లక్షల కోట్లుగా అంచనా. దీంతో పోల్చితే ప్రస్తుతం ఎంఎఫ్‌లలో రిటైల్, హెచ్ఎన్ఐల పెట్టుబడుల విలువ 15 శాతం(రూ.7.5 లక్షల కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ‘డీయోనిటైజేషన్ ప్రభావంతో బ్యాంకింగ్‌లోకి రూ.8-12 లక్షల కోట్ల నిధులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఎంఎఫ్‌ల 15 శాతం వాటా అలాగే కొనసాగినా కూడా మధ్యకాలికంగా చూస్తే రూ.1-1.5 లక్షల కోట్లు రిటైల్, హెచ్ఎన్ఐల నుంచి ఫండ్సలోకి వచ్చే అవకాశం ఉంది’అని ఫండ్సఇండియా.కామ్ సహ వ్యవస్థాపకులు, సీఓఓ శ్రీకాంత్ మీనాక్షి పేర్కొన్నారు. లిక్విడ్, షార్ట్‌టర్మ్ డెట్ఫండ్సలోకి... బ్యాంకింగ్ రంగంలోకి అదనపు ద్రవ్య లభ్యత పెరుగుతుండటంతో.. ఈ నిధుల్లో కొంత లిక్విడ్, షార్టర్మ్ డెట్ ఫండ్సలోకి రావచ్చని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్మీ పటేల్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల తగ్గుదల అంచనాల నేపథ్యంలో కొంత మొత్తం షార్ట్‌టర్మ్, డైనమిక్ బాండ్ ఫండ్సలోకి ప్రవహించే అవకాశం ఉందన్నారు. ‘ప్రభుత్వ డీమోనిటైజేషన్ చర్యలు.. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తానికి సానుకూలంగా నిలవనుంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన, మరింత వ్యవస్థీకృతమైన పెట్టుబడి సాధనాలపైపు దృష్టిసారించనుండటమే దీనికి కారణం’ అని రిలయన్స ఎంఎఫ్ సీఈఓ సుదీప్ సిక్కా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేశీయంగా ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణ ఆస్తులు(ఏయూఎం) రూ.16.3 లక్షల కోట్లకు చేరింది. కాగా, డీమోనిటైజేషన్ ప్రభావంతో త్వరలోనే ఈ మొత్తం రూ.20 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందని సిక్కా పేర్కొన్నారు. -
ఎస్బీఐ నుంచి స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీ...
హైదరాబాద్: అధిక నెట్‌వర్త్ కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్ఐ) కోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ‘స్మార్ట్ ప్రివిలేజ్’ పేరుతో యూనిట్ ఆధారిత జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా 8 రకాల ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫండ్ల మధ్య స్విచ్చింగ్ (మార్పిడి), ప్రీమియం మార్పిడిని పాలసీ కాల వ్యవధిలో ఎన్ని సార్లయినా చేసుకునే వీలుంది. ఒకే విడత ప్రీమియం, పరిమిత కాల ప్రీమియం లేదా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే సౌలభ్యం ఉంది. పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 8 నుంచి 13 సంవత్సరాలు. గరిష్ట వయసు 55 సంవత్సరాలు. అలాగే, పాలసీ కాల వ్యవధి 5 నుంచి 30 సంవత్సరాలుగా ఉంది. పాలసీ కాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఫండ్ విలువ లేదా బీమా ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. గడువు తీరే వరకూ జీవించి ఉంటే ఫండ్ విలువను చెల్లిస్తారు. కావాలంటే దీన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా తీసుకోవచ్చు. -
సంపన్నులకు ప్రత్యేకం..!
శ్రీమంతుల కోసం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్న బీమా కంపెనీలు.. దేశీయంగా సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య పెరుగుతుండటంతో వారి బీమా అవసరాలపై ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. వారి అవసరాలకు తగ్గ బీమా పాలసీల్ని తయారు చేసి అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీల మొత్తం పాలసీదారుల్లో సంపన్నుల వాటా ఆరు నుంచి పది శాతం దాకా ఉంటుందని అంచనా. అయితేనేం.. సాధారణ పాలసీదారుతో పోలిస్తే సంపన్న పాలసీదారు నుంచి వచ్చే ప్రీమియం 20-30 శాతం అధికంగా ఉంటోంది. అందుకే హెచ్ఎన్ఐలకు ప్రాధాన్యమిస్తూ బ్యాంకులు ప్రత్యేక బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నట్లే బీమా కంపెనీలు కూడా గోల్డ్, ప్లాటినం వంటి పేర్లతో ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. హెచ్ఎన్ఐల కోసమే ప్రత్యేకంగా హెల్త్ సురక్ష గోల్డ్, ప్లాటినం పాలసీలను అందిస్తోంది. వీటిలో మెటర్నిటీ, డెంటల్, కళ్లద్దాలు, హియరింగ్ ఎయిడ్స్, కాంటాక్ట్ లెన్సులు మొదలైన వాటికి కూడా అదనపు కవరేజీ ఉంటుంది. అలాగే, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే.. రూ. 1,00,000 పైచిలుకు వార్షిక ప్రీమియం కట్టే వారిని ఈ సంస్థ గోల్డ్ సర్కిల్ కేటగిరీ కింద చేరుస్తుంది. వీరికి ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఎస్ఎంఎస్ చేసిన రెండు గంటల్లోనే సదరు పాలసీదారును కంపెనీ ప్రతినిధి సంప్రదిస్తారు. సాధారణ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి నిమిషాల కొద్దీ వేచి చూడాల్సిన పని లేకుండా 20 సెకన్ల లోపే స్పందించే రిలేషన్షిప్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. వీరికి కంపెనీ ఈ-మ్యాగజైన్‌తో పాటు ఇంటి దగ్గరే చెక్ పికప్ సదుపాయమూ ఉంటుంది. మ్యాక్స్ లైఫ్ మొత్తం పాలసీదారులలో ఇలాంటి సంపన్నుల సంఖ్య దాదాపు 24 శాతం ఉంది. ప్లాటినం కవరేజీ..: మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిల్వర్, గోల్డ్, ప్లాటినం పేరుతో మూడు రకాల పాలసీలు అందిస్తోంది. అత్యంత సంపన్నుల కోసం రూపొందించిన ప్లాటినం కవరేజీ పాలసీలో గరిష్టంగా రూ. 50 లక్షల దాకా కవరేజీ మొత్తం ఉంటుంది. ఆస్పత్రిలో చేరితే ప్రైవేట్ రూమ్ ఖర్చులు మొదలుకుని పిల్లలకు పన్నెండేళ్లు వచ్చేదాకా వేయాల్సిన వివిధ టీకాలకయ్యే వ్యయాల దాకా ఇందులో అన్నింటికీ కవరేజీ ఉంటుంది. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే కంపెనీ ప్రత్యేకంగా రిలేషన్షిప్ డాక్టర్‌ను కూడా పంపిస్తుంది. ఈ పాలసీని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తూ ఉన్న పక్షంలో హెల్త్ రిలేషన్షిప్ ప్రోగ్రాం సర్వీసులు కూడా పొందవచ్చు. ఈ ప్రోగ్రాం కింద చివరిగా కట్టిన ప్రీమియంలో దాదాపు 10 శాతం దాకా విలువ చేసే వైద్య సేవలు పొందవచ్చు. ఏజెంట్లకూ ప్రయోజనాలు.. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో సంపన్న పాలసీదారులకే కాకుండా వారి పాలసీలను తెచ్చిపెట్టే టాప్ పర్ఫార్మెన్స్ ఏజెంట్లకు కూడా కంపెనీపరమైన ప్రయోజనాలు ఉంటాయి. పాలసీల వివరాల వెల్లడి, పత్రాల జారీ మొదలైనవి వేగవంతంగా జరిగేలా తోడ్పడేందుకు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను కంపెనీ అందిస్తోంది. ప్రాధాన్యం గల ఏజెంట్ల నుంచి వచ్చే మెయిల్స్‌ను వెంటనే గుర్తించేలా వారికి స్పెషల్ ఈ మెయిల్ ఐడీలు ఇస్తుంది. సంస్థ ఖాతాలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు హెచ్ఎన్ఐ కస్టమర్లు ఉన్నారు. సంస్థ మొత్తం పాలసీదారుల్లో ఇది ఆరు శాతం. అందుబాటులోకి ఐటీ కొత్త వెబ్సైట్ ఆదాయ పన్ను విభాగం తాజాగా మరింత మెరుగుపర్చిన వెబ్‌సైట్‌ను పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుల పరిష్కారానికి, సత్వరం ఇతరత్రా సర్వీసులు సులువుగా పొందేందుకు అవసరమైన లింక్‌లను ఇందులో పొందుపర్చింది. www.incometaxindia.gov.in పేరిట అందుబాటులోకి వచ్చిన కొత్త వెబ్సైట్ మొదటి పేజీలో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ అనే కొత్త లింకు ఉంటుంది. పాన్ కార్డు పొందడం దగ్గర్నుంచి ఈ-రిటర్నుల దాఖలు, రీఫండ్ల గురించి తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం దాకా వివిధ సర్వీసుల పేజీని ఈ లింకుతో అనుసంధానం చేశారు. -
నల్లధనంపై సెబీ యుద్ధం
59 సంస్థలపై నిషేధ న్యూఢిల్లీ : పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్ఎన్ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. బీఎస్ఈలో స్టాక్ ఆప్షన్ల ద్వారా కొన్ని సంస్థలు ఎప్పుడూ నష్టాలను, మరికొన్ని ఎప్పుడూ లాభాలను గడిస్తున్నట్లు సెబీ గుర్తించింది. ఇది ఏవిధంగా జరుగుతోంది తెలపాలని సెబీ ఆ సంస్థలను కోరినప్పుడు అవి సరైన సమాధానం ఇవ్వలే దు. దీంతో సెబీ వాటిపై నిషేధం విధించింది. సెబీ గతంలో దాదాపు 950 సంస్థలను నిషేధించింది. -
శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు
వీళ్లు ...చాలా రిచ్ కనీసం రూ.180 కోట్లున్న శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు వీళ్ల పెట్టుబడి 47 శాతం రియల్టీలో; అది కూడా విదేశాల్లో ఏటా 12 నుంచి 14 శాతం పెరుగుతున్న అపర కుబేరులు నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ‘అతి భారీ సంపన్నుల’ సంఖ్య భారీగా పెరుగుతోంది. మామూలుగా అధిక సంపద ఉన్నవారిని హైనెట్వర్త్ ఇండివిడ్యుజల్స్గా (హెచ్ఎన్ఐ) వ్యవహరిస్తుండగా... ఈ అతి భారీ సంపన్నులను మాత్రం అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలో రానురాను ఈ తరహా సంపన్నుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోతోందని, ఏటా 60 శాతం వృద్ధితో వీరి సంఖ్య ఇపుడు దేశంలో 1,652కు చేరిందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ తెలియజేసింది. వీరంతా ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులు పెట్టినట్లు ‘నైట్‌ఫ్రాంక్ వెల్త్-2015’ నివేదికలో తెలియజేసింది. ఇంకా ఈ నివేదికలో ఏ అంశాలు వెల్లడించిందంటే.. 2005-15 మధ్య... అంటే పదేళ్లలో భారతీయ అతిభారీ సంపన్నులు 166 శాతం వృద్ధి రేటుతో... 50 శాతం పెట్టుబడులను విదేశాల్లో, అదికూడా స్థిరాస్తుల్లోనే పెట్టారు. వీరిలో 23 శాతం మంది సొంత అవసరాల కోసం స్థిరాస్తులను కొంటే, 77 శాతం మంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మాత్రమే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నవారిలో 42 శాతం మంది ఆస్ట్రేలియాకు చెందినవారు కాగా... రష్యా మూడో స్థానంలో నిలుస్తోంది. రియల్ ఎస్టేట్‌లో ఈ అల్ట్రా శ్రీమంతుల పెట్టుబడులు ఏటా 2% చొప్పున పెరుగుతున్నాయి. దేశీ శ్రీమంతులు తమ ఆదాయంలోని 50 శాతం పెట్టుబడులను స్థిరాస్తి రంగంలో పెడుతుండగా... 33.1 శాతం మంది ఈక్విటీల్లో... 20.4 శాతం మంది డెట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. స్థిరాస్తి రంగంలో న్యూయార్క్‌లోనే వీరి పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. 2013-14 డిసెంబర్ మధ్య 18.8 శాతం మేర పెరగ్గా... కొలరాడో, బాలి, ఇస్తాంబుల్, అబుదాబిల్లో 14.7 శాతం నుంచి 16 శాతం మేర పెరిగాయి. ఏటా శాన్ఫ్రాన్సిస్కో, డబ్లిన్, కేప్‌టౌన్, మస్కట్, లాస్‌ఏంజెలిస్‌లో 18 శాతం మేర రియల్టీ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,72,850 అల్ట్రా శ్రీమంతులుండగా వీరిలో 1,652 మంది భారతీయులు. ఇంకా చెప్పాలంటే 39 మంది మన హైదరాబాదీలు. 2004లో ఇండియాలో 622 మంది అల్ట్రా శ్రీమంతులుండగా ఈ పదేళ్లలో వారి సంఖ్య 1,652కు చేరింది. 2024 నాటికి దేశంలో వీరి సంఖ్య 3,371కి పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అల్ట్రా శ్రీమంతుల సంపద మొత్తం 20.8 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 1,309 లక్షల కోట్లన్న మాట. అయితే వీరి పెట్టుబడులు ఎక్కువగా కేంద్రీకృత మయింది మాత్రం లండన్‌లోనే. ఆసియా దేశాల్లో అయితే హాంగ్కాంగ్లోఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకించి ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లోని అల్ట్రా శ్రీమంతులు ఎక్కువగా అమెరికా, యూరప్‌లలోని స్థిరాస్తులను కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోనూ అల్ట్రా శ్రీమంతులు! ఇదిలా ఉంటే ఈ అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ భాగ్యనగరంలోనూ ఉన్నారండోయ్. 2014 నాటికి 619 యూహెచ్ఎన్డబ్ల్యూఐలతో ముంబై మొదటి స్థానంలో నిలవగా.. 39 మందితో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. వచ్చే పదేళ్లలో అంటే.. 2024 నాటికి వీరి సంఖ్య 136 శాతం పెరిగి దాదాపు 92కి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఏడాదికి వీరి సంఖ్య దాదాపు 12 నుంచి 14 శాతం మధ్య పెరగవచ్చని నివేదిక పేర్కొంది. నగరాల వారీగా యూహెచ్ఎన్డబ్ల్యూఐ పట్టిక ఇదిగో.. ఎవరీ అల్ట్రా శ్రీమంతులు...? అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అంటే... ఒక వ్యక్తికి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వ్యక్తిగత స్థిరాస్తులుండాలి. ఆ ఆస్తి విలువ ప్రారంభ ధర 30 మిలియన్ డాలర్లు... అంటే రూ. 180 కోట్లుండాలి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ అంటే... సదరు వ్యక్తి ఆస్తి విలువ కనీసం మిలియన్ డాలర్లు... అంటే మన కరెన్సీలో రూ. 6 కోట్లు. -
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఓకే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల పట్ల 80 శాతానికి పైగా ఇన్వెస్టర్లు సంతృప్తిగా ఉన్నారని ఒక సర్వేలో తేలింది. 60 శాతానికి పైగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు డిస్ట్రిబ్యూటర్ల సేవలతో సంతృప్తిగానే ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఐఏఐ) ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని కేటగిరి ఇన్వెస్టర్లు-వ్యక్తిగత క్లయింట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, అన్ని వయస్సుల వారీగా ఈ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే ముఖ్యాంశాలు..., 86 శాతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో సంతృప్తిగా ఉన్నారు. తమ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో అసంతృప్తిగా ఉన్న ఇన్వెస్టర్లు 14 శాతంగా ఉన్నారు. మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల పట్ల డిస్ట్రిబ్యూటర్లు తగిన అవగాహనను కలిగి ఉండాలని, సకాలంలో కస్టమర్ సర్వీసులందజేయాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు మరింత పారదర్శకంగా ఉండాలని, ఇన్వెస్టర్ల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వాంఛిస్తున్నారు.