ఈ వారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ఆరంభమైంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది.
ఈ వారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ఆరంభమైంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 8,805 పాయింట్ల పైన ముగిసింది. చివర్లో కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 17 పాయింట్లు పెరిగి 28,352 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 8,806 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, లోహ, విద్యుత్తు రంగ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 28, 450 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్లు, విదేశీ నిధుల వరదతో మరింతగా లాభపడి ఇంట్రాడే గరిష్ట స్థాయి, 28,459 పాయింట్లకు ఎగసింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. మొత్తం మీద సెన్సెక్స్ 262 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
ఐటీడీసీ యేడాది గరిష్టం...
ఇండియా టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐటీడీసీ) జోరు కొనసాగుతోంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్ల లాభాలను కొనసాగిస్తూ ఈ షేర్ సోమవారం 20 శాతం లాభపడి రూ.422 వద్ద ముగిసింది. ఇది యేడాది కాల గరిష్ట స్థాయి.గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 59 శాతం పెరిగింది.