SSE
-
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చేస్తోంది: ఇక వాటికి పెట్టుబడుల వెల్లువ!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఎస్ఈ)ని ఏర్పాటు చేయడానికి సెబీ ఆమెదించిందని తెలిపింది. దీని ప్రకారం మార్చినుంచి ఎస్ఎస్ఈ మొదలు కానుందని చెప్పింది. దీని ప్రకారం ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓపి) లేదా ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్‌పిఇలు), సామాజిక ఉద్దేశం ప్రాధాన్యాన్ని స్థాపించే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజ్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు, లిస్టింగ్ కావచ్చు అని ఎన్ఎస్ఈ వెల్లడించింది. అంటే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులుఈ సంస్థల షేర్లను కొనుగోలు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం, వాటికి దృశ్యమానతను అందించడానికి, సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు ఇది ఉపయోపడనుంది. అలాగే వినియోగంలో పారదర్శకతను పెంచడానికి సామాజిక సంస్థలకు కొత్త మార్గాన్ని అందించాలనేది కూడా తమ లక్ష్యమని ఎస్ఎస్ఈ పేర్కొంది ఈ సెగ్మెంట్లో అర్హత కలిగిన ఎన్ఓపీ నమోదు చేసుకోవచ్చు. తద్వారా వీటిని పెట్టుడుల సమీకరణకు ఆస్కారం లభిస్తుంది. ఆన్‌బోర్డింగ్ అర్హత కలిగిన ఎన్జీవో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) వంటి సాధనాలను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం ఇష్యూ పరిమాణం కోటి రూపాయలు, సబ్స్క్రిప్షన్ కనీస అప్లికేషన్ సైజును రూ. 2 లక్షలుగాను సెబీ నిర్దేశించింది. -
సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్‌ఎస్‌ఈకి ఎన్పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్)ను కూడా సమర్పించాలి. మరిన్ని వివరాలు .. ► చారిటబుల్ ట్రస్టుగా ఎన్పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి. ► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్‌వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి. ► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. ► అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థలు తప్ప కార్పొరేట్ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్ కంపెనీలను సోషల్ ఎంటర్‌ప్రైజ్‌గా గుర్తించరు. స్టాక్ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు.. క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్ మెంబరు పూల్ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
10,000 ముంగిట నిఫ్టీ
► మేజిక్ ఫిగర్‌ను దాటిన ఆగస్టు నిఫ్టీ ఫ్యూచర్ ► సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు అప్ ► సరికొత్త రికార్డుస్థాయిల్లో ముగిసిన సూచీలు ముంబై: తాజా కొనుగోళ్ల ఫలితంగా ఎన్ఎస్ఈ ప్రధాన సూచి నిఫ్టీ చరిత్రాత్మక 10,000 పాయింట్ల స్థాయికి చేరువయ్యింది. సోమవారం ఇంట్రాడేలో 9,982 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని తాకిన నిఫ్టీ–50 చివరకు 51 పాయింట్ల పెరుగుదలతో నూతన గరిష్టస్థాయి 9,966 పాయింట్ల వద్ద ముగిసింది. డెరివేటివ్స్ విభాగంలోనైతే ఆగస్టు నెల నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు 10,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 10,013 పాయింట్ల వద్దకు చేరడం విశేషం. అయితే చివర్లో లాభాల స్వీకరణ కారణంగా ఈ ఫ్యూచర్ 9,995 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు ర్యాలీ జరిపి రికార్డు గరిష్టస్థాయి 32,246 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాల్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) 7.2 శాతం వద్ద స్థిరపర్చడం కూడా మార్కెట్లో ఉత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు తెలిపారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.7 శాతంగా వుంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరిపారని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనీయర్ ఫండ్ మేనేజర్ కార్తిక్‌రాజ్ లక్ష్మణన్ చెప్పారు. ఆల్‌టైమ్ హైకి సమీపంలో ఆర్ఐఎల్.. స్టాక్ సూచీల తాజా ర్యాలీకి బహుళ వ్యాపారాల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నేతృత్వం వహించింది. అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు రిలయన్స్ జియోఫోన్, బోనస్ షేర్లు, ప్రత్యేక డివిడెండు వంటి అనూహ్య ప్రకటనలతో ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో శుక్రవారం 4 శాతంవరకూ పెరిగిన ఆర్ఐఎల్ తాజాగా మరో 2 శాతం ఎగిసింది. ఇంట్రాడేలో 1,624 వరకూ ర్యాలీ జరిపిన ఆర్ఐఎల్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయి సమీపానికి చేరింది. అయితే చివరకు రూ. 1,615 వద్ద ముగిసింది. 2008 జనవరిలో ఈ షేరు నమోదుచేసిన ఆల్‌టైమ్ రికార్డు స్థాయి బీఎస్ఈలో 1,626కాగా, ఎన్ఎస్ఈలో రూ. 1,649. సోమవారం ఆర్థిక ఫలితాల్ని ప్రకటించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.83 శాతం జంప్‌చేసి రూ. 1,738 వద్ద ముగిసింది. టీసీఎస్, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎస్బీఐలు 1–2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ లాబ్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1–2.5 శాతం మధ్య నష్టపోయాయి. -
క్లోజింగ్‌లో నిఫ్టీ కొత్త రికార్డు
♦ మళ్లీ 30వేల పైకి సెన్సెక్స్ ♦ 231 పాయింట్ల లాభంతో 30,126 వద్ద ముగింపు ♦ 48 పాయింట్ల లాభంతో 9,360కు సెన్సెక్స్ బ్యాంకింగ్, మౌలిక రంగాల్లో ప్రభుత్వ సంస్కరణల కారణంగా స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు స్థాయిల్లో ముగియగా. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది రెండోసారి 30,100 పాయింట్లపైన ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు ఎగబాకింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు 9,360 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 30,170 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 231 పాయింట్ల లాభంతో 30,126 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 275 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. లాభాలు ఎందుకంటే.. మొండి బకాయిల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆర్బీఐకి మరింత సాధికారితను అందించేలా ఒక ఆర్డినెన్స్‌ను తేవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంక్ షేర్లు 9 శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వ మౌలికరంగ ప్రాజెక్టుల్లో దేశీయంగా తయారైన ఉక్కును వినియోగించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించడం కూడా సానుకూల ప్రభావం చూపింది. రేట్లను యధాతథంగా కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడం, అక్కడి కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం వంటి కారణాల వల్ల యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం కూడా కలసివచ్చింది. ఏప్రిల్‌లో సేవల రంగం వృద్ధి చెందిందని నికాయ్ పీఎంఐ గణాంకాలు వెల్లడించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచింది. సేవల రంగం వృద్ధి సాధించడం ఇది వరుసగా మూడో నెల. బ్యాంక్ షేర్లు కళకళ మొండి బకాయిల పరిష్కారానికి ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు బాగా ఉండడం కూడా కలసి రావడంతో బ్యాంక్ షేర్లు 9 శాతం వరకూ లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు ఎగబాకింది. ఇంట్రాడేలో 22,744 పాయింట్ల కొత్త శిఖరాన్ని తాకిన బ్యాంక్ నిఫ్టీ చివరకు జీవిత కాల గరిష్ట స్థాయి, 22,720 పాయింట్ల వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాలతో సరి
ఈ వారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ఆరంభమైంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ 8,805 పాయింట్ల పైన ముగిసింది. చివర్లో కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్లు పెరిగి 28,352 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 8,806 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, లోహ, విద్యుత్తు రంగ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 28, 450 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్లు, విదేశీ నిధుల వరదతో మరింతగా లాభపడి ఇంట్రాడే గరిష్ట స్థాయి, 28,459 పాయింట్లకు ఎగసింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. మొత్తం మీద సెన్సెక్స్ 262 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఐటీడీసీ యేడాది గరిష్టం... ఇండియా టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐటీడీసీ) జోరు కొనసాగుతోంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్ల లాభాలను కొనసాగిస్తూ ఈ షేర్ సోమవారం 20 శాతం లాభపడి రూ.422 వద్ద ముగిసింది. ఇది యేడాది కాల గరిష్ట స్థాయి.గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 59 శాతం పెరిగింది.