సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూలగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. మధ్యంతర బడ్జెట్, ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు మరింత ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 395 పాయింట్లు పతనమై 35,629కు చేరింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 10,648 వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతు స్థాయిలు సెన్సెక్స్ 36వేలు, నిఫ్టీ 10700 కిందికి చేరాయి.
ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మెటల్ రంగాలు భారీగా నష్టపోతుండగా మీడియా లాభపడుతోంది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ విన్నర్స్‌గా నమోదవుతుండగా ఇన్‌ఫ్రాటెల్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, కోల్ ఇండియా, యూపీఎల్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment