
సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నా స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 38,528 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 11,568 వద్ద ట్రేడవుతోంది. ట్రేడర్లు లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.
రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.6-0.4 శాతం చొప్పున పుంజుకోగా, మెటల్స్, ఐటీ 0.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఐవోసీ, ఎయిర్‌టెల్, బీపీసీఎల్, ఐబీ హౌసింగ్, గెయిల్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో లాభాల్లోనూ, వేదాంతా, జీ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment