
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచి భారీ అమ్మకాలతో బలహీనంగా ట్రేడ్ అయిన సూచీలు చివరల్లో మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్ 517 పాయింట్లు పతనమై 38 వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిప్టీ కూడా 11400 స్థాయి దిగువకు చేరింది. చివరకు 487 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 37789 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 11359 వద్ద ముగిసింది. తద్వారా వరుసగా ఆరో రోజుకూడా నష్టాల్లోనే ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, మిడ్ క్యాప్ పార్మ, రియల్టీ ఇలా అన్ని సెక్టార్లు నష్టపోయాయి.
అలాగే జీ గ్రూపు షేర్ల పతనం, రిలయన్స్ నష్టాలు ప్రభావితం చేశాయి. వేదాంతా సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్ బ్యాంకు ఓన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. యూపిఎల్, భారత్ పెట్రోలియం, టైటాన్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ ,జెట్ ఎయిర్‌వేస్ లాభపడ్డాయి.