ముంబై : ప్రారంభ లాభాలన్నింటిన్నీ మార్కెట్లు కోల్పోయాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంలో 35,739 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,856 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్ మీటింగ్‌పై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఈ సారి ఫెడ్ తన వడ్డీరేట్లను పెంచుతుందని మార్కెట్లలో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. రంగాల వారీగా ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా లాభపడగా.. ఆటో, ఇన్‌ఫ్రా, మెటల్ రంగాలు నేటి ట్రేడింగ్‌లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహింద్రా నేటి ట్రేడింగ్‌లో టాప్ గెయినర్లుగా లాభాల పంట పండించాయి. మరోవైపు రిలయన్స్ జియో మంగళవారం ప్రకటించిన డబుల్ ధమాకా ఆఫర్ ప్రత్యర్థ టెల్కోలను భారీగా దెబ్బకొట్టింది. ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్‌షేర్లు దాదాపు 6 శాతం వరకు పడిపోయాయి. డబుల్ ధమాకా ఆఫర్ కింద కంపెనీ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై అదనంగా 1.5 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment