సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాలతో దూసుకుపోతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలిసారి 37వేల మార్క్‌ను అధిగమించింది. అలాగే 11171 వద్ద నిఫ్టీ కూడా మరో రికార్డ్ హైని టచ్ చేసింది. సెన్సెక్స్ 128, నిఫ్టీ 27పాయింట్లు పుంజుకుని కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆటో షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇంకా బ్యాంకింగ్, సిమెంట్ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. హీటో మోటో కార్ప్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, అంబుజా, ఏసీసీ, బీఓబీ, టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్ర, బాష్, బీపీసీఎల్, వేదాంతా నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment