ఆర్బీఐ పాలసీ: లాభాల్లో మార్కెట్లు
Published Wed, Jun 7 2017 9:34 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీ సందర్భంగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంలో 31,256 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 17.10 పాయింట్ల లాభంలో 9,650పైన ట్రేడవుతోంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అయిన ద్రవ్యవిధాన కమిటీ నేడు వడ్డీరేట్లపై తమ నిర్ణయం ప్రకటించనుంది. ఆర్బీఐ నిర్ణయంపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. మెజార్జీ విశ్లేషకులు ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయదని అంచనావేస్తున్నారు.
దీంతో మార్కెట్లు కూడా సాధారణంగానే ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో గెయిల్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎం అండ్ ఎం, హీరో మోటార్ కార్ప్, వేదంత, భారతీ ఇన్ ఫ్రాటెల్ లాభాలు పండించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, టీసీఎస్, సిప్లా, టాటా మోటార్స్, బీపీసీఎల్, టాటా పవర్ ఒత్తిడిలో కొనసాగాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 7 పైసలు పడిపోయి 64.49 వద్ద ప్రారంభమైంది. యూకే ఎన్నికల నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
Advertisement