
ముంబై : ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాల వెల్లువతో శుక్రవారం స్టాక్ మార్కెట్ల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నెగెటివ్ జోన్‌లోకి మారాయి. తొలి త్రైమాసిక జీడీపీ సహా పలు కీలక గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల పైగా నష్టపోతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 10,895 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment