ముంబై : ఫెడ్ వడ్డీరేటు పెంపుతో, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో బలహీనంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరికీ నష్టాలతోనే ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 139 పాయింట్లు పడిపోయి 35,600 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు లాభంలో 10,808 వద్ద క్లోజయ్యాయి. ఫెడ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ ప్రకటన ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు అప్రమత్తగా వ్యవహరిస్తున్నారు. సహాయక ప్యాకేజీలకు చెల్లుచీటీ రాయనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కారణంగా ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ పెంపు ఉండవచ్చునంటూ ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాలతో కుదేలయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టైటాన్ కంపెనీ, వేదంతా, ఎల్ అండ్ టీ షేర్లు ఒత్తిడిలో కొనసాగగా.. లుపిన్, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియాలు లాభాలు పండించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. మైండ్రి, సన్ టీవీ, ఎం అండ్ ఎం ఫైనాన్సియల్, మణప్పురం ఫైనాన్స్ షేర్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment