ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 300 పాయింట్ల మేర లాభపడింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 7వేల మార్క్ను దాటింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ కూడా లాభాలతో ఆరంభమైంది. మరోవైపు మరోవైపు రూపాయి 13 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 68.34గా ఉంది. 30 నెలలు తర్వాత రూపాయి స్వల్పంగా కోలుకుంది.
ఒక వైపు రూపాయి కోలుకోవడం, మరొకవైపు చమురు ధరలు పుంజుకోవడం కూడా మార్కెట్లలో పాజిటివ్ నింపింది. దీంతో సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 23వేల 625 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 7వేల 194 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెక్టార్ సూచీల్లో రియాల్టీ 1.48శాతం, టెక్ సూచీలు 1.19శాతం , క్యాపిటల్ గూడ్స్ 2.50శాతం , బ్యాంకెక్స్ 1.39శాతం లాభపడుతుండగా, నిఫ్టీ టాఫ్ గేయినర్స్ లిస్ట్‌లో కేయిర్న్ 5.76శాతం , హిందాల్కో 5.32శాతం, డాక్టర్ రెడ్డీస్ 4.41శాతం లాభపడుతున్నాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో అదానీ పోర్ట్స్ 0.61శాతం , ఏసియన్ పేయింట్స్ 0.40శాతం నష్టపోతున్నాయి.