సాక్షి, న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో విపరీతమైన పోటీ నెలకింది. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలకు ధీటుగా చైనా కంపెనీలు షావోమి,వివో, ఒప్పో, రియల్‌మి లాంటి కంపెనీలు కొత్త వ్యూహాలతో మార్కెట్‌లో పాగావేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బాస్‌లు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ట్విటర్వే దికగా పరస్పరం బహిరంగంగా ట్వీట్ యుద్ధం మొదలు పెట్టారు. దీంతో నెటిజన్లు పలు జోక్‌లు, ట్విటర్ మెమెలతో పండుగ చేసుకుంటున్నారు.
ప్రధానంగా షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌జైన్ భారతీయ మార్కెట్‌లో టాప్ పొజిషన్‌కోసం తంటాలుపడుతున్నాడు. 2018లో రికార్డు స్థాయి అమ్మకాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపింది. షావోమి. అయితే 2019 నాటికి కథ వేరేలా ఉంది. చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి బడ్జెట్ ధరల డివైస్‌లతో షావోమికి వణుకు పుట్టిస్తోంది. సరికొత్త ఫీచర్లు, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకట్టు కుంటోంది. ఈ పరిణామం గుర్రుగా ఉన్న జైన్ రెడ్‌మి నోట్ ప్రొ 7 స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ క్వాల్కం స్నాప్డ్రాగెన్ రియల్ మి 3 ప్రొ ప్రాసెసర్ కంటే పాతది అని ట్వీట్ చేశాడు.
తమ మిలియన్ల విక్రయాలను చూసి ఎవరికో భయం పట్టుకుందంటూ రియర్‌మి ఇండియా సీఈవో సేథ్ కౌంటర్ ఇచ్చాడు. దీంటో ఈ ట్వీట్లు, విపరీతంగా రీట్వీట్ అవుతుండటం, విపరీతంగా జోక్స్ పేలుతుండటంతో ఇద్దరూ వారి వారి ట్వీట్లను డిలిట్ చేయడం విశేషం.
కౌంటర్ పాయింట్ పరిశోధన ప్రకారం 2019 మొదటి త్రైమాసికంలో మార్కెట్ వాటా పడిపోయింది. గత ఏడాది 31శాతంతో పోలిస్తే 2 శాతం క్షీణించి ఏడాది 29 శాతానికి పరిమితమైంది. అయితే రియల్‌మి మాత్రం రెండవ వరుస క్వార్టర్లో టాప్ 5 బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మరోవైపు వివో 2019 ఫస్ట్ కార్టర్లో టాప్‌కి చేరింది. (మను జైన్ వివోను విడిచిపెట్టడం గమనార్హం.)
ఇటీవల తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్ చేసిన మనూ జైన్.. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోందని విన్నాం. ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0 వస్తోంది..అంటూ ఉడికిస్తూ ట్వీట్ చేశారు. ఆసుస్ జెన్ ఫోన్ సిరీస్‌లో భాగంగా రొటేటింగ్ కెమెరా స్పెషల్ ఫీచర్‌గా జెన్‌ఫోన్6ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మరి షావోమి బాస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరో అంటూ వ్యాఖ‍్యలు వినబడుతున్నాయి. 2019 మొదటి త్రైమాసికంలో షావోమి ఎగుమతులు 2 శాతం క్షీణించడం, భారత్‌లో రియల్ మి ఏడు శాతం మార్కెట్ వాటాను సాధించడంతో మను జైన్‌లో ఆందోళన మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా రియల్ మి దేశంలో 150 నగరాల్లో 20వేల మల్టీ బ్రాండ్ రీటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే ఈ ఏడాది కనీసం 15 మిలియన్ హ్యాండ్ సెట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్ మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment