స్నాప్‌డీల్ 3 రోజుల ఫెస్టివల్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ మూడు రోజుల ఫెస్టివల్ సేల్‌కు తెరతీసింది. నిన్నటి(శుక్రవారం) నుంచి ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్‌కు సంబంధించిన అన్ని కేటగిరీ వస్తువులపై రెండింతలు డిస్కౌంట్లను అంటే 70 శాతం వరకు డిస్కౌంట్‌ను స్నాప్‌డీల్ ప్రకటించింది. రేపటి వరకు(ఆదివారం) వరకు ఈ సేల్ నడుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు వెనువెంటనే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కింద కనీస లావాదేవీ రూ.2500 ఉండాలి. ఇటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పండుగ సీజన్‌కు సన్నద్ధమవుతుండగానే, స్నాప్‌డీల్ ఈ ప్రకటన ఇచ్చేసింది.
స్మార్ట్‌ఫోన్లపై అందించే బ్లాక్‌బస్టర్ డీల్స్ ఇవే..
-
గూగుల్ పిక్సెల్ ఫోన్లపై 13 శాతం తగ్గింపు, దీంతో రూ.67వేలుగా ఉన్న గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్(32జీబీ) రూ.58వేలకే అందుబాటు
-
లెనోవో జెడ్2 ప్లస్ 32జీబీ ఫోన్‌పై 44 శాతం తగ్గింపు, దీంతో రూ.17,999గా ఉన్న ఈ ఫోన్‌రూ.9999కే విక్రయం
-
స్వైప్ కనెక్ట్ పవర్ 4జీ(16జీబీ) కూడా రూ.4999కు తగ్గింపు
-
శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ(3జీబీ, 64జీబీ) ఫోన్ 8 శాతం తగ్గింపు, రూ.22,999కే విక్రయం
-
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2 ఈ471 4జీ స్మార్ట్‌ఫోన్‌పై 61 శాతం తగ్గింపు, రూ.6499కే అందుబాటు
-
వివో వీ5ఎస్ ఫర్‌ఫెక్ట్ సెల్ఫీపై 16 శాతం తగ్గింపుతో రూ.16,700కే విక్రయం