
స్నాప్‌డీల్ మెగా డీల్స్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకించింది.. మే 17నుంచి 19వ తేదీవరకు పరిమితి కాలానికి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్‌పై దాదాపు 80శాతం తగ్గింపును అందిస్తోంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై అదనంగా 15శాతం డిస్కౌంట్. డీల్350 కూపన్ల ద్వారా రూ.350 దాకా ఆదా చేసుకునే అవకాశం.
సరసమైన ధరల్లో అందుబాటుల్లో ఉన్న ఫీచర్ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచింది. నోకియా 8110 బనానా ఫోన్, ఐవూమి ఐ2 లైట్, కూల్‌ప్యాడ్ మెగా 5 సిరీస్‌లపై డిస్కౌంట్ అందిస్తోంది.
వీటితో పాటు కోల్డ్ కాఫీ మేకర్స్, షర్బత్ మేకర్స్, ట్రావెల్ బాగ్స్, ఎయిర్ కూలర్లు, కూలర్ ప్యాడ్లపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా వివిధ సాంప్రదాయ వస్తువులు, డోలక్, తాళాలు లాంటి సంగీత సాధనాలు కూడా ఈ తగ్గింపు ధరల్లో లభిస్తాయి. మరిన్నివివరాలు స్నాప్‌డీల్ వెబ్‌సైట్ లో లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment