స్నాప్‌డీల్ లో రూ. 3,762 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: జపనీస్ టెలికం దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ తమ కంపెనీలో రూ. 3,762 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం స్నాప్‌డీల్ ప్రకటించింది. భారత్ కు చెందిన ఇ-కామర్స్ కంపెనీలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టిన అత్యంత పెద్ద మొత్తం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టినప్పటికీ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు.
ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది. రానున్న ఆరు నెలల కాలంలో మొబైల్ టెక్నాలజీ మార్కెట్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. వ్యూహాత్మక పెట్టుబడి, స్నాప్ డీల్ తో భాగస్వామ్యం ద్వారాలో భారత్ తమ ప్రవేశాన్ని ఘనంగా చాటాలని సాఫ్ట్ బ్యాంక్ భావిస్తోంది.