Softbank Group
-
ఓలా సరికొత్త రికార్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐబీసీ సెంటర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరులో అత్యాధునిక బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌ను (బీఐసీ) ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోమవారం కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సెల్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదేనని వెల్లడించింది. 165 రకాల ప్రత్యేక, ఆధునిక విభిన్న ల్యాబ్ పరికరాలతో ఈ కేంద్రం కొలువుదీరనుందని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. బ్యాటరీ ప్యాక్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్ అన్నీ కూడా ఒకే గొడుకు కింద ఉంటాయని చెప్పారు. పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్డీ, ఇంజనీరింగ్ అభ్యర్థులతోసహా అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఓలా నియమించుకోనుంది. వీరికి మరో 1,000 మంది పరిశోధకులు సహాయకులుగా ఉంటారు. ఇటీవలే లిథియం అయాన్ సెల్‌ను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్ సెల్ ఇదే. 2023 నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు
టోక్యో: అంతర్జాతీయంగా పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోవడంతో జపాన్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం భారీగా నష్టాలు చవి చూసింది. ఏకంగా 1.7 లక్షల కోట్ల యెన్ల (దాదాపు 13 బిలియన్ డాలర్లు) నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ 4.9 లక్షల కోట్ల యెన్ల లాభాలు ఆర్జించింది. తాజా సమీక్షాకాలంలో అమ్మకాలు 10.5 శాతం పెరిగి 6.2 లక్షల కోట్ల యెన్లకు చేరాయి. కంపెనీ పోర్ట్‌ఫోలియోకు ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన ఇంధన ధరలు మొదలైనవన్నీ కొంత కాలం పాటు తమ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇక నుంచి తమ పెట్టుబడులపై మరింత అదుపు తెచ్చుకోవడంతో పాటు కొంత రక్షణాత్మకంగా వ్యవహరించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ తెలిపారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు యాహూ వెబ్ సర్వీసెస్, చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, వాహన సేవల సంస్థ డీడీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు ఉన్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ట్విటర్‌ను ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడి!
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులపై జపాన్ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంక్ మరోసారి దృష్టిపెట్టింది. 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఈ పెట్టుబడి సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 కు సంబంధించి 1.2-1.5 బిలియన్ల డాలర్ల నిధుల్లో భాగం. దీంతో మూడేళ్ల క్రితం తన మొత్తం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన ఫ్లిప్‌కార్ట్ విలువ సుమారు 28 బిలియన్ల డాలర్లకు చేరనుంది. మరో రెండు మూడు నెలలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ప్రోసస్ వెంచర్స్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఇతరపెట్టుబడిదారులు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను పెంచుకోనున్నాయి. ఫలితంగా మొత్తం ఫ్లిప్‌కార్ట్ విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా లైవ్‌మింట్ నివేదిక ప్రకారం ప్రోసస్ వెంచర్స్. నాస్పెర్స్, విభాగం కూడా తమ వాటాను పెంచుకునేందుకు యోచిస్తున్నాయి. రానున్న12-18 నెలల్లో లిస్టింగ్‌కు రనున్న తరుణంలో అంతకుముందే ఈ లావాదేవీలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. అలాగే ఐపీఓకు ముందు మరోసారి నిధులు సమీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ కోసంజేపీ మోర్గాన్ గోల్డ్‌మన్ సాచ్స్ లావాదేవీలను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, దాని డిజిటల్ చెల్లింపుల విభాగం ఫోన్‌పే 2022 నాటికి యుఎస్‌లో ఐపీవోకి వెళ్లాలని భావిస్తోంది.. ఆ సమయానికి సుమారు 40 బిలియన్ల నికర విలువను సాధించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల నిమిత్తం సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ, కెనడియన్ పెన్షన్ ఫండ్ సీపీపీఐబీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయా సంస్థలు అధకారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కొత్తేమీ కాదు. కానీ మే 2018లో తన పెట్టుబడులను సాఫ్ట్ బ్యాంకు ఉపసంహరించుకుంది. వాల్‌మార్ట్ ఆధీనంలోకి ఒక సంవత్సరంలోనే సుమారు 20 శాతం వాటాను విక్రయించింది. ఇప్పుడు, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్-2లో భారతదేశంలో దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇది గత నెలలో స్విగ్గీలో 1 బిలియన్ డాలర్లు, బ్యాంకింగ్ టెక్ సంస్థ జీటాలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్దతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి : దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! కరోనా సెకండ్ వేవ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం -
సాఫ్ట్బ్యాంకులోకి కీర్తిగా రెడ్డి
న్యూఢిల్లీ: సాఫ్ట్ బ్యాంకు 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను ఫేస్బుక్ నుంచి తీసుకుంటున్న కీర్తిగారెడ్డికి అప్పగిస్తోంది. విశేషమేమిటంటే సాఫ్ట్‌బ్యాంకు ఓ మహిళను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు పరిధిలో 12 ఫండ్స్ ఉన్నాయి. ‘‘సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌లో కీర్తిగారెడ్డి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫండ్‌ను ఆమె నిర్వహిస్తారు. సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్ నిషార్‌తో కలసి పనిచేస్తారు’’ అని సాఫ్ట్‌బ్యాంకు ప్రతినిధి తెలియజేశారు. కీర్తిగారెడ్డి భారత్, అమెరికాల్లో ఫేస్బుక్ కోసం పనిచేశారు. స్టాండర్డ్ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బోర్డులోనూ పనిచేస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్‌కు ఉబెర్ టెక్నాలజీస్, వివర్క్, చైనాకు చెందిన దీదీ చుక్సింగ్ తదితర బడా సంస్థల్లో వాటాలున్నాయి. విజన్ ఫండ్ పార్ట్నర్లలో అందరూ మగవారే ఉండడంపై గత సెప్టెంబర్‌లో సాఫ్ట్‌బ్యాంకు వ్యవస్థాపకుడు మసయోషి సన్ ఓ ప్రశ్న ఎదుర్కొన్నారు. అయితే, తనకు ఎవరి పట్లా వివక్ష లేదని ఆ సందర్భంలోనే స్పష్టం చేశారు. -
ఓలాకు షాక్: ఉబెర్‌కు భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భారీ పెట్టుబడులను ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఎట్టకేలకు సాధించింది. జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉబెర్‌తో సాఫ్ట్ బ్యాంక్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక బిలియన్డాలర్ల విలువ చేసే ఉబెర్వాటాను సాఫ్ట్ బ్యాంకు కొనుగోలు చేయనుందని ఉబెర్ దృవీకరించింది. అనంతరం దాదాపు 14శాతం వాటాను సాఫ్ట్ బ్యాంక్ కొనుగలు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఈ డీల్ వెలుగులోకి వచ్చినప్పటికీ కార్పొరేట్ గవర్ననెన్స్, కొన్ని న్యాయపరమైనచిక్కుల కారణంగా ఇంతకాలం వాయిదాపడింది. సోప్ట్ బ్యాంక్ డ్రాగోనియెర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంతో ఒక ఒప్పందం కుదిరిందని ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విదేశాలలోతమ సేవల విస్తరణకు దోహదపడుతుందనీ కార్పొరేట్ పాలనను బలపరుస్తుందని పేర్కొంది. కాగా జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌కు భారత్‌లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ పెట్టుబడుల ద్వారా భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రత్యర్థి కంపెనీ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్క అమెరికాకు చెందిన ఉబెర్ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోసాప్ట్బ్యాంకు భారీపెట్టుబడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉబెర్, సాఫ్ట్‌బ్యాంక్, పెట్టుబడులు, -
రూ.3,299 కోట్లు సమీకరించిన ఓలా
రోజుకి పది లక్షల బుకింగ్ రిక్వెస్ట్‌లు ఏడాది కాలంలో 30 రెట్ల వృద్ధి న్యూఢిల్లీ: ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా వివిధ ఇన్వెస్టర్ల నుంచి 50 కోట్ల డాలర్ల(రూ.3,299 కోట్లు) పెట్టుబడులు (సిరీస్ ఎఫ్ ఫండింగ్) సమీకరించింది. బెయిలి గిఫోర్డ్, టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, చైనాకు చెందిన డిడి కవుడి, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, డీఎస్టీ గ్లోబల్ తదితర సంస్థల నుంచి ఈ పెట్టుబడులు సమీకరించామని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. అమెరికాకు చెందిన ఉబర్, దేశీయ ట్యాక్సీ అగ్రిగేటర్ మేరుల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఓలా షేర్, ఓలా ప్రైమ్, ఓలా మనీ వంటి వినూత్నమైన సొల్యూషన్ల ద్వారా మరింత వృద్ధి సాధించడానికి ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో 30 రెట్ల వృద్ధిని సాధించామని, ప్రస్తుతం రోజుకి పది లక్షల బుకింగ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయని వివరించారు. సింగపూర్‌కు చెందిన సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ నుంచి కూడా నిధులు వచ్చాయని సమాచారం. దీంతో ఈ కంపెనీ విలువ 500 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. తాజా పెట్టుబడులతో కలుపుకొని ఇప్పటివరకూ 130 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఓలా సమీకరించింది. భారత్‌లో 102 నగరాల్లో సేవలందిస్తున్న ఓలా ప్లాట్‌ఫామ్‌పై 3,50,000కు పైగా నమోదిత వాహనాలున్నాయి. -
స్నాప్‌డీల్ లో రూ. 3,762 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: జపనీస్ టెలికం దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ తమ కంపెనీలో రూ. 3,762 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం స్నాప్‌డీల్ ప్రకటించింది. భారత్ కు చెందిన ఇ-కామర్స్ కంపెనీలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టిన అత్యంత పెద్ద మొత్తం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టినప్పటికీ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు. ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది. రానున్న ఆరు నెలల కాలంలో మొబైల్ టెక్నాలజీ మార్కెట్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. వ్యూహాత్మక పెట్టుబడి, స్నాప్ డీల్ తో భాగస్వామ్యం ద్వారాలో భారత్ తమ ప్రవేశాన్ని ఘనంగా చాటాలని సాఫ్ట్ బ్యాంక్ భావిస్తోంది.