
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిష్టాత్మక ట్రాక్టర్ బ్రాండ్ సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ పాలుపంచుకుంది. తన వంతు సాయంగా కేరళ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను అందించింది. దీనితోపాటు ఐదు బహుళ ప్రయోజనకర హెవీ డ్యూటీ ట్రాక్టర్స్‌ను కూడా రాష్ట్రానికి ఇచ్చింది.
ఇందుకు సంబంధించి ఒక చెక్కు, ట్రాక్టర్ నమూనాను సోనాలికా గ్రూప్ ప్రెసిడెంట్ ముదిత్ గుప్తా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. కేరళ ప్రజలకు సంస్థ మరింత సాయం అందజేస్తుందని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment