ఖర్చులు తగ్గించండి లేదా పన్నులు పెంచండి!
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2016-17 వాల్యూమ్-2 ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సర్వేను పత్రికా సమావేశంలో మీడియాకు వివరించారు. రూపాయి విలువ, వ్యవసాయ రుణాల రద్దు జీడీపీని ప్రభావితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం చాలా కష్టమన్నారు. రైతు రుణలకు మాఫీ కల్పించడం వల్ల వృద్ధి రేటను సాధించడం కుదరదనీ, 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టార్గెట్ రేటును అందుకోవడం పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకోవడం కానీ, లేదా పన్నుల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని ఆయన సూచించారు.
గత పదినెలలుగా టార్గెట్లకు మించి ఆర్థిక వ్యవస్థ పుంజకుందని, దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసినట్టు చెప్పారు. అలాగే ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. అద్భుతమైన రాజకీయాలు, సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశాల కలయిక జీఎస్‌టీ అని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని3 శాతానికి చేరుకోవడంలో ఇది సహాయపడుతుందని అరవింద్ అన్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) 7 వ పే కమిషన్, మంచి రుతుపవనాలు, మార్పిడి రేట్లు లాంటి అంశాల క ఆరణంగా ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటుకు సంబంధించి, మార్చి చివరినాటికి ద్రవ్యోల్బణం మూడు శాతానికి దిగి వస్తుందన్నారు.
జీఎస్టీ నెట్‌వర్క్ కింద సుమారు 13.5 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ అమలు ఊహించినదాని కంటే ఎక్కువగా ఉందన్నారు. జీఎస్టీ అమలు తీరు ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ వేగం కూడా పెరిగిందన్నారు. వ్యవసాయ దిగుబడి పెరిగినా, ధరలు తగ్గడం వల్ల ఆదాయం మాత్రం పడిపోయిందన్నారు. కేటాయింపులను తగ్గించామని, రాష్ట్రాలు పన్నులను పెంచాల్సిన సందర్భం వచ్చిందన్నారు. రైతుల రుణాలకు మాఫీ కల్పించడం వల్ల ధరలు తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. కానీ ఇది ద్రవ్యోల్బణానికి దారి తీయదన్నారు. అంతేకాకుండా, ఈ వృద్ధి అధిక వడ్డీ రేటు, సానుకూల మార్పిడి రేటు మరియు అధిక పోటీతత్వానికి కారణమవుతుందని అరవింద్ చెప్పారు.