మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్ | Sterling Skids To New 31-Year Low On Brexit Fallout Worries | Sakshi
Sakshi News home page

మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్

Published Tue, Jul 5 2016 5:14 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

మరోసారి పతనమైన  స్టెర్లింగ్ పౌండ్ - Sakshi

మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్

లండన్ :యూరోపియన్ యూనియన్ నుంచి  బ్రిటన్  వైదొలగిన ప్రభావం ఇంకా  పౌండ్ ను పట్టి పీడిస్తోంది.  బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ వాసులు ఓటువేయడంతో భారీగా పతనమైన కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌   విలువ మంగళవారం  మరింత దిగజారింది. డాలర్  కంటే యూరో కు వ్యతిరేకంగా మరింత తక్కువ పడిపోయింది ఆర్థిక, ద్రవ్య అనిశ్చితి పరిస్థితులపై  ఇన్వెస్టర్ల ఆందోళనతో పౌండ్ మరోసారి 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 1.3 శాతం  నష్టంతో 1985 నాటి కంటే కిందికి  క్షీణించింది. అలాగే  రెఫరెండం తర్వాత  సర్వీస్  సెక్టార్ గ్రోత్ రేట్  మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా  పౌండ వాల్యూని  దెబ్బ తీసింది.   యూరో కి వ్యతిరేకంగా పౌండ్ విలువ  84.90 పెన్స్ కు పడిపోయింది.   ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డాలర్ కు వ్యతిరేకంగా పౌండ్ విలువ  10 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే.   బ్రెగ్జిట్ పరిణామంతో  యూరోజోన్ కూడా బలహీనంగా ఉంది. 

అయితే  బ్రిటన్ కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ఫైనాన్షియల్  స్టెబిలిటీ రిపోర్ట్ ను ప్రకటించనుంది. ఇది బ్యాంకుల స్థిరీకరణకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవకాశం ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. తన సామర్థ్యం పునరుద్ఘాటించుకోనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  దీని ప్రభావం పౌండ్ మీద ఉండదని తెలిపారు.  అయితే రెఫరెండానికి ముందు స్థాయికి  పౌండ్ విలువ  చేరాలంటే  మరిన్ని వారాలు పడుతుందని ఆర్ బీసీ  క్యాపిటల్ మార్కెట్స్ కి చెందిన అదాం అలే చెప్పారు. మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనావేశారు. మరోవైపు బ్రిటిష్  ఆర్థిక మంత్రి జార్జ్ ఓస్ బోర్న్ బ్యాంకు ఉన్నతాధికారులతో మంగళవారం  భేటీ అయ్యారు.  ఈయూ నుంచి  నిష్క్రమణ   ఎలా స్పందించాలనే దానిపై చర్చలు జరిపారు.   బ్రెగ్జిట్  బ్లాస్ట్  ఫలితంగా  బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ లో ముఖ్యమైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సోమవారం తన ట్రేడింగ్  ను  సస్పెండ్ చేసింది.  అటు ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని   సోమవారం అమెరికా  మార్కెట్లకు సెలవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement