Sterling
-
ఇక ఆర్ఐఎల్ సోలార్ పవర్
జీరో కార్బన్‌పై దృష్టి పెట్టిన డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగం పెంచింది. ఇప్పటికే రిలయన్స్ న్యూ ఎనర్జీ పేరిట పునరుత్పాదక ఇంధన కంపెనీని నెలకొలి్పన సంస్థ ఒకే రోజు రెండు కంపెనీలపై గురిపెట్టింది. తాజాగా నార్వేజియన్ దిగ్గజం ఆర్ఈసీ సోలార్‌ను సొంతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లోనూ 40 శాతం వాటాను చేజిక్కించుకుంది. తద్వారా 2035కల్లా జీరో కార్బన్ పోర్ట్‌ఫోలియో నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎస్ఎల్) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) కో నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో 2035కల్లా నికరంగా జీరో కార్బన్‌తో శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియో కంపెనీగా ఆవిర్భవించేందుకు ఆర్ఐఎల్ తొలి అడుగు వేసింది. ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో శుద్ధ ఇంధన తయారీ సామర్థ్యాలపై రూ. 60,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. కంపెనీ తీరిలా.. నార్వే, సింగపూర్ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)నకు సోలార్ ఎనర్జీలో పట్టుంది. కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన కంపెనీ నార్వేలో సోలార్ గ్రేడ్ పాలీసిలికాన్ తయారీకి రెండు, సింగపూర్‌లో పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి ఒక ప్లాంటు చొప్పున నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 1,300 మందికిపైగా ఉద్యోగులున్నారు. విస్తరణకు మద్దతు ఆర్ఈసీ విస్తరణ ప్రణాళికలకు పూర్తి మద్దతివ్వనున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఈసీ.. సింగపూర్‌లో 2–3 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. బ్రాండ్న్యూ 2 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరిట జామ్‌నగర్‌లో ఏర్పాటైన కాంప్లెక్స్‌లో ఆర్ఈసీ సాంకేతికతలను ఆర్ఐఎల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్కు షాపూర్జీ కంపెనీలో వాటా శుద్ధ ఇంధన ఆస్తులపై దృష్టిపెట్టిన ఆర్ఐఎల్ తాజాగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,845 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా కంపెనీ బోర్డులో ఇద్దరు సభ్యులను నియమించనుంది. ఈపీసీ కార్యకలాపాల స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌ను ఖుర్షీద్ యజ్డీ డరువాలా కుటుంబంతో కలసి షాపూర్జీ పల్లోంజీ భాగస్వామ్య ప్రాతిపదికన(జేవీ) ఏర్పాటు చేసింది. డీల్‌లో భాగంగా తొలుత షేరుకి రూ. 375 ధరలో 2.93 కోట్ల స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రిలయన్స్ న్యూ ఎనర్జీ పొందనుంది. ఈక్విటీ జారీ తదుపరి పెరగనున్న వాటా మూలధనంలో ఇది 15.46 శాతానికి సమానంకాగా.. తదుపరి మరో 1.84 కోట్ల షేర్లను(9.7 శాతం వాటాకు సమానం) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి అదే ధరలో సొంతం చేసుకోనుంది. ఆపై సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ నుంచి 25.9 శాతం వాటా(4.91 కోట్ల షేర్లు) కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. వెరసి కంపెనీలో 40 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. గ్రూప్ రూ. 20,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను కొద్ది రోజులుగా షాపూర్జీ పల్లోంజీ అమలు చేస్తోంది. వినూత్న ఇన్వెస్ట్మెంట్... కొత్త, ఆధునిక సాంకేతికతలపై ఇన్వెస్ట్‌చేసే మా వ్యూహాలకు అనుగుణంగానే ఆర్ఈసీ గ్రూప్‌ను కొనుగోలు చేశాం. నిర్వహణా సామర్థ్యాలు సైతం ఈ దశాబ్దాంతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకున్న 100 గిగావాట్ల శుద్ధ ఇంధన సాధనకు ఉపయోగపడనున్నాయి. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ అధినేత -
మరోసారి అహ్మద్ పటేల్‌కు ఈడీ సెగ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు మరోసారి ఈడీ సెగ తగిలింది. మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్‌ను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం ఢిల్లీలోని ఆయన నివాసంలో విచారించనున్నారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల శనివారం అహ్మద్ పటేల్ నివాసంలో 8 గంటలపాటు సుదీర్ఘంగా ఆయనను విచారించిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటిక్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు ఇవ్వగా, కరోనావైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చిన కారణంగా విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. (అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం) ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ 5వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో నిరర్ధక అస్తులుగా మారాయి. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మోసం ఆరోపణలు మొత్తం 8,100 కోట్ల రూపాయలకు చేరాయి. బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కేసుకు సంబంధించి అహ్మద్ పటేల్ పాత్రపై ఈడీ విచారణ సాగిస్తోంది. స్టెర్లింగ్ బయోటిక్‌కు చెందిన సందేశర సోదరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నైజీరియాలో దాక్కున్న స్టెర్లింగ్ బయోటిక్ ప్రమోటర్లు నితిన్, చేతన్‌ను భారత దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు ఏజెన్సీలు ప్రయత్నం చేస్తున్నాయి. (అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు) -
అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: సందేశార సోదరుల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(70)ను సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఢిల్లీలోని అహ్మద్ పటేల్ ఇంట్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలంటూ అహ్మద్ పటేల్‌కు ఇటీవలే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విచారణకు రాలేనని తేల్చిచెప్పారు. దీంతో ఈడీ బృందం నేరుగా అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లింది. వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్ సందేశార, చేతన్ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు. ఈ వ్యవహారంతో అహ్మద్ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ ఆయనను ప్రశ్నించింది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. 30న మరోసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. -
పేలవంగా ‘స్టెర్లింగ్ సోలార్’
న్యూఢిల్లీ: స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర రూ.780తో పోల్చితే బీఎస్ఈలో ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.700 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.755, రూ.691 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.725 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 3 లక్షలు, ఎన్ఎస్ఈలో 45 లక్షల మేర షేర్లు ట్రేడయ్యాయి. మంగళవారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,632 కోట్లుగా నమోదైంది. ఇటీవలే ముగిసిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,125 కోట్లు సమీకరించింది. రూ.775–780 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 92 శాతం మాత్రమే సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్ ఇండియా, డాషే ఈక్విటీస్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ సెక్యూరిటీస్ ఇండియా సంస్థలు వ్యవహరించాయి. -
స్టెర్లింగ్ చేతికి యూనిటెక్ విద్యుత్ వ్యాపారం
న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ, యూనిటెక్ తన విద్యుత్తు పంపిణీ వ్యాపారాన్ని స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీకి విక్రయించింది. విద్యుత్ పంపిణీ లైన్ల తయారీ, ఇన్స్టలేషన్ కార్యకలాపాలు నిర్వహించే యూనిటెక్ పవర్ ట్రాన్సిమిషన్‌ను స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీకి రూ.100 కోట్లకు విక్రయించామని యూనిటెక్ తెలిపింది. ఈ మేరకు షాపూర్జీ పల్లోంజీ ప్రమోట్ చేస్తున్న స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీతో వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని వివరించింది. ఈ వంద కోట్ల మొత్తాన్ని స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ సుప్రీం కోర్ట్‌లో డిపాజిట్ చేస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత యూనిటెక్ పవర్ట్రాన్సిమిషన్ కంపెనీ, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది. -
రూ.4,700 కోట్ల స్టెర్లింగ్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: బ్యాంకులను రూ.5,000 కోట్ల మేరకు మోసగించిన కేసుకు సంబంధించి గుజరాత్ ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్‌నకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. ఈ సంస్థ, దాని ప్రమోటర్లు నితిన్, చేతన్ సందేశారాలపై గత ఏడాది అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది. సందేశారా సోదరులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి వివిధ బ్యాంకుల నుండి సుమారు రూ.5,000 కోట్ల రుణాలను పొందారు. 4,000 ఎకరాల స్థలం, ఫ్యాక్టరీ, యంత్రాలు, కంపెనీలు, నిర్వాహకులకు చెందిన 200 బ్యాంక్ ఖాతాలను, రూ.6.67 కోట్ల విలువైన వాటాలను, లగ్జరీ కార్లు వంటి పలు స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. స్టెర్లింగ్ గ్రూపు చేసిన పలు విదేశీ లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నామని, 50 విదేశీ బ్యాంకు ఖాతాలు, నైజీరియాలోని ఆయిల్ రిగ్స్, ఆయిల్ ఫీల్డ్స్‌లను సీజ్ చేసేందుకు విదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
ఈడీ షాక్: ఆంద్రాబ్యాంక్ షేరు పతనం
సాక్షి ముంబై : స్టాక్మార్కెట్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్ల పతనం కొనసాగుతోంది. పీఎన్బీ, కెనరా కుంభకోణాలకుతోడు ఇతర స్కాంల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం నాటి మ్యాజిక్ ర్యాలీలో ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్ తన సత్తా చాటగా, పీఎస్‌యూ సెక్టార్మాత్రం చతికిలపడింది. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్, సందేశరాస్ గ్రూపు కుంభకోణం మరోసారి వెలుగులోకి రావడంతో ఆ కేసుతో సంబంధం ఉన్న ఆంధ్రాబ్యాంకు షేరు సోమవారం 52వారాల కనిష్టానికి పతనమైంది. సుమారు రూ.5వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ గార్గ్‌పై తాజాగా మరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసింది. దీంతో న్వెస్టర్లు ఆంధ్రా బ్యాంకు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. చివరికి బీఎస్ఈలో 7శాతంతో నష్టంతో ముగిసింది. మొత్తం 2018 ఏడాదిలో ఇప్పటిదాకా 41శాతానికిపైగా పతనమైంది. అంతేకాదు ఎనలిస్టులు కూడా ఇన్వెస్టర్లకు అప్రమత్తతను సూచించారు. సందేశరాస్ గ్రూపు కుంభకోణం స్టెర్లింగ్ బయోటెక్కుచెందిన సందేశరా గ్రూపు ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి అక్రమ పద్ధతిలో సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం కోసం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా రూ. 2కోట్లను అనూప్ స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. తాజా ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2011లో ఇన్ కంట్యాక్స్ అధికారులు సీజ్ చేసిన డైరక్టర్ డైరీ లో చేతన్ జయంతిలాల్ సందేశారా, నితిన జయంతిలాల్ సందేశారా అనే స్టెర్లింగ్ బయోటెక్ డైరక్టర్లు ఇతగాడికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయని తేలింది. ఈ చెల్లింపులు 2008-09 మధ్య జరిగిన లావాదేవీలుగా ఈడీ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా చార్జ్ షీట్లొ ఆరోపించారు. -
మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్
లండన్ :యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన ప్రభావం ఇంకా పౌండ్ ను పట్టి పీడిస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటువేయడంతో భారీగా పతనమైన కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ మంగళవారం మరింత దిగజారింది. డాలర్ కంటే యూరో కు వ్యతిరేకంగా మరింత తక్కువ పడిపోయింది ఆర్థిక, ద్రవ్య అనిశ్చితి పరిస్థితులపై ఇన్వెస్టర్ల ఆందోళనతో పౌండ్ మరోసారి 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 1.3 శాతం నష్టంతో 1985 నాటి కంటే కిందికి క్షీణించింది. అలాగే రెఫరెండం తర్వాత సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా పౌండ వాల్యూని దెబ్బ తీసింది. యూరో కి వ్యతిరేకంగా పౌండ్ విలువ 84.90 పెన్స్ కు పడిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డాలర్ కు వ్యతిరేకంగా పౌండ్ విలువ 10 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ పరిణామంతో యూరోజోన్ కూడా బలహీనంగా ఉంది. అయితే బ్రిటన్ కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ను ప్రకటించనుంది. ఇది బ్యాంకుల స్థిరీకరణకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవకాశం ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. తన సామర్థ్యం పునరుద్ఘాటించుకోనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రభావం పౌండ్ మీద ఉండదని తెలిపారు. అయితే రెఫరెండానికి ముందు స్థాయికి పౌండ్ విలువ చేరాలంటే మరిన్ని వారాలు పడుతుందని ఆర్ బీసీ క్యాపిటల్ మార్కెట్స్ కి చెందిన అదాం అలే చెప్పారు. మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనావేశారు. మరోవైపు బ్రిటిష్ ఆర్థిక మంత్రి జార్జ్ ఓస్ బోర్న్ బ్యాంకు ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ అయ్యారు. ఈయూ నుంచి నిష్క్రమణ ఎలా స్పందించాలనే దానిపై చర్చలు జరిపారు. బ్రెగ్జిట్ బ్లాస్ట్ ఫలితంగా బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ లో ముఖ్యమైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సోమవారం తన ట్రేడింగ్ ను సస్పెండ్ చేసింది. అటు ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు.