సాక్షి ముంబై : స్టాక్‌మార్కెట్లో ప్రభుత‍్వ బ్యాంక్ షేర్ల పతనం కొనసాగుతోంది. పీఎన్‌బీ, కెనరా కుంభకోణాలకుతోడు ఇతర స్కాంల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం నాటి మ్యాజిక్ ర్యాలీలో ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్ తన సత్తా చాటగా, పీఎస్‌యూ సెక్టార్‌మాత్రం చతికిలపడింది. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్, సందేశరాస్ గ్రూపు కుంభకోణం మరోసారి వెలుగులోకి రావడంతో ఆ కేసుతో సంబంధం ఉన్న ఆంధ్రాబ్యాంకు షేరు సోమవారం 52వారాల కనిష్టానికి పతనమైంది.
సుమారు రూ.5వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ గార్గ్‌పై తాజాగా మరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసింది. దీంతో న్వెస్టర్లు ఆంధ్రా బ్యాంకు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. చివరికి బీఎస్‌ఈలో 7శాతంతో నష్టంతో ముగిసింది. మొత్తం 2018 ఏడాదిలో ఇప్పటిదాకా 41శాతానికిపైగా పతనమైంది. అంతేకాదు ఎనలిస్టులు కూడా ఇన్వెస్టర్లకు అప్రమత్తతను సూచించారు.
సందేశరాస్ గ్రూపు కుంభకోణం
స్టెర్లింగ్ బయోటెక్‌కుచెందిన సందేశరా గ్రూపు ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి అక్రమ పద్ధతిలో సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం కోసం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా రూ. 2కోట్లను అనూప్ స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. తాజా ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2011లో ఇన్ కంట్యాక్స్ అధికారులు సీజ్ చేసిన డైరక్టర్ డైరీ లో చేతన్ జయంతిలాల్ సందేశారా, నితిన జయంతిలాల్ సందేశారా అనే స్టెర్లింగ్ బయోటెక్ డైరక్టర్లు ఇతగాడికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయని తేలింది. ఈ చెల్లింపులు 2008-09 మధ్య జరిగిన లావాదేవీలుగా ఈడీ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా చార్జ్ షీట్‌లొ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment