Biotech Company
-
బయోటెక్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
-
లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!
కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పుంజుకున్న మార్కెట్ ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. ఏడాదికి కాలంలోనే సెన్సెక్స్ 20 వేల పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో లక్షల కోట్లలో మదుపరులు లాభపడ్డారు. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది మే 20న మల్టీబ్యాగర్ ప్రొసెడ్ ఇండియా లిమిటెడ్ షేర్లను లక్ష రూపాయలు పెట్టి కొనిన వారి జాతకం అరునెలల్లోనే మారిపోయింది. ఎందుకంటే, వీరికి ఈ 6 నెల కాలంలోనే 6,006.90% రిటర్న్స్ తో రూ.60 లక్షల రూపాయలు లాభాలు వచ్చాయి. 2021 మే 20న రూ.1.345గా ఉన్న పెన్నీ స్టాక్ ధర నేడు నవంబర్ 18న బీఎస్ఈలో రూ.88.55గా ఉంది. అంటే ఆరు నెలల క్రితం ప్రొసెడ్ ఇండియా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం ఈ రోజు రూ.60 లక్షలుగా మారి ఉండేది. అయితే, ఇదే కాలంలో సెన్సెక్స్ 19.50% పెరిగింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది హైదరాబాద్‌కు చెందిన కంపెనీ. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది చాలు, ఆఫీస్‌కు రండి) ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్(పీఐఎల్) తెలంగాణ (భారతదేశం)లోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రముఖ అగ్రి బయో టెక్నాలజీ కంపెనీ. ప్రోసీడ్ అనేది పంటల దిగుబడి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్ వ్యవసాయ సమాజానికి సేవ చేయడానికి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది. సెప్టెంబర్ త్రైమాసికం చివరిలో పబ్లిక్ వాటాదారులు సంస్థలో 3% వాటాను కలిగి ఉన్నారు. 23,176 మంది వాటాదారులు వ్యవసాయ బయోటెక్ విత్తన కంపెనీలో 30.95 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. ఇది ఒక వ్యవసాయ బయోటెక్నాలజీ కంపెనీ. భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తన వ్యాపారాలలో నిమగ్నమైంది. (చదవండి: మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలేమిటి?) -
ఒక చుక్క టీకాతో కరోనాకు చెక్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నివారించేందుకు భారత్ బయోటెక్ కంపెనీ ఓ వినూత్నమైన టీకాను అభివృద్ధి చేస్తోంది. ముక్కు ద్వారా ఒక చుక్క మందు వేసుకోవడం ద్వారా పనిచేసే ఈ టీకాపై మొదటి, రెండో దశ మానవ ప్రయోగాలు కూడా పూర్తయినట్లు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. కోరోఫ్లూ అని పిలుస్తున్న ఈ టీకాను తాము విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, ఫ్లూజెన్ అనే వ్యాక్సిన్ కంపెనీలతో కలసి అభివృద్ధి చేస్తున్నామంది. ఫ్లూజెన్ కంపెనీ ఎం2ఎస్ఆర్ ఇన్‌ప్లుయెంజా వైరస్ ఆధారంగా కోరోఫ్లూ తయారైందని వెల్లడించారు. ఈ టీకా రోగ నిరోధక వ్యవస్థలో స్పందన కలుగచేస్తుందని చెప్పారు. కరోనా వ్యాధి కారక వైరస్ జన్యు పదార్థాన్ని ఎం2ఎస్‌ఆర్‌లోకి జొప్పించి కొత్త వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేయడం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వంటి అన్ని బాధ్యతలు చేపడుతుందని, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వీలుగా 30 కోట్ల టీకాలను సిద్ధం చేస్తామని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. ఫ్లూజెన్ తయారీ పద్ధతులతో భారత్ బయోటెక్‌లో టీకాలు సిద్ధం చేస్తామన్నారు. ఆరు నెలలు పరీక్షలు.. కోరోఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జంతువులపై పరీక్షలు జరిపేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్లో మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రం మనుషుల్లో టీకా సామర్థ్యం, భద్రతలపై పరీక్షలు మొదలుపెడుతుందని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కోరోఫ్లూ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ఎం2ఎస్ఆర్పై ఇప్పటికే నాలుగు ఫేస్–1, ఫేస్–2 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, వందలాది మందిపై జరిగిన ఈ ప్రయోగాల ద్వారా టీకా సురక్షితమేనని స్పష్టమైందని చెప్పారు. కోరోఫ్లూ జలుబు కారక వైరస్ యాంటీజెన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని ఫలితంగా ఈ టీకా ద్వారా అటు కరోనా వైరస్‌కు, ఇటు ఇన్‌ప్లుయెంజా వైరస్‌కు ప్రతిగా రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని ఫ్లూజెన్ సహ వ్యవస్థాపకుడైన గాబ్రియెల్ న్యూమన్ తెలిపారు. ముక్కు ద్వారా కోరోఫ్లూను అందించడం వల్ల కరోనా, ఇన్‌ప్లుయెంజా వైరస్లు సహజసిద్ధంగా శరీరంలోకి ప్రవేశించే దారిలోనే మందు అందుబాటులోకి వస్తుందని ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ పలు రకాలుగా స్పందిస్తుందని వివరించారు. -
‘పల్లీ నూనె’తో పల్టీ కొట్టించాడు
నాగోలు: పల్లీనూనె వ్యాపారం పేరుతో వందలాది మందిని పల్టీ కొట్టించి రూ.100 కోట్లు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ ఎండీ జిన్నా కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ కేంద్రంగా అక్రమాలకు పాల్పడిన వీరి నుంచి రూ.5 కోట్ల విలువైన స్థిర,చరాస్తులతో పాటు రూ.21.20లక్షల నగదు, 20లీటర్ల పల్లీనూనె, 20లీటర్ల ఖాళీ క్యాన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఆదినుంచి మోసాలే.. నిజామాబాద్ జిల్లా, సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబైలోని లెదర్ కర్మాగారంలో పనిచేసిన ఇతను 1991లో హైదరాబాద్‌కు వచ్చి సొంత వ్యాపారం మొదలు పెట్టాడు. 1995 కోల్‌కతాకు చెందిన మిట బిశ్వాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. సిగ్మా గ్రాఫిక్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నిర్వహించిన అతను ఆ తర్వాత నిజామాబాద్‌లో స్టాపర్స్ వరల్డ్ పేరుతో అగరుబత్తీలు తయారుచేసి విక్రయించేవాడు. నిరుద్యోగ యువతకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి రూ.75వేల చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చిన అతను మహాలైఫ్ ఆన్లైన్ మార్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2005లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో తన కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా చేరిన అహల్యారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడలో అహల్యారెడ్డి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కర్నూలులో 350 ఎకరాలకొనుగోలుకు యత్నం.. ప్రజల నుంచి వసూలు చేసిన సుమారు రూ.150కోట్లతో కర్నూలులో 350 ఎకరాల స్థలం కొనుగోలు చేసేందుకు జిన్నా కాంతయ్య ప్రణాళిక రూపొందించాడు. మార్చి 15 వరకు గోదాం లీజ్ అగ్రిమెంట్ పూర్తి కానుండడంతో కర్నూలులో రియల్ దందాకు సిద్ధమయ్యాడు. ఇతడిపై ఇప్పటికే హైదరాబాద్‌లో ఐదు కేసులు, వరంగల్ అర్బన్‌లో ఒక కేసు, కడపలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర్రావు, ఉప్పల్ ఏసీపీ సందీప్, ఉప్పల్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ రవిబాబు, ఎస్ఐ ఆంజనేయలు పాల్గొన్నారు. ఆకట్టుకునేలా పథకాలు.. జిన్న కాంతయ్య సోదరుడు వెంకటేశ్వర్‌రెడ్డి 2014లో సికింద్రాబాద్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో 2017 వరకు అతను దానిని పట్టించుకోలేదు. 2017 డిసెంబర్లో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ 2018 జూలైలో కార్యాలయాన్ని ఉప్పల్‌కు మార్చి గోడౌన్‌ను ఏర్పాటు చేశాడు. రెండో భార్య అలేఖ్యారెడ్డి, బావమరిది అనిల్‌రెడ్డి, మేనేజర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రియ సహకారంతో మల్టీలెవల్ మోసాలకు తెరలేపాడు. సూరత్ నుంచి రూ.20వేలకు కొనుగోలు చేసి తెప్పించిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించుకోవచ్చునని ప్రచారం చేశాడు. ఇందులో భాగంగా రూ.లక్షతో పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామని చెప్పాడు. పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.10 వేలతో పాటు రూ.5 వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. రూ.రెండు లక్షల మెషిన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇస్తామని, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామని చెప్పాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయించేవాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ ఇస్తామని ఆశచూపాడు. ఇదే తరహాలో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో రూ.లక్ష స్కీంలో 1385 మందిని, రూ.2లక్షల స్కీంలో 144మందిని, ఐదు లక్షల స్కీంలో 19 మంది, పదిలక్షల స్కీంలో నలుగురిని చేర్పించాడు. ఆయా స్కీంలలో చేరిన వారికి డబ్బులు ఇవ్వకుండా పల్లీలు, మిషన్లు, అందజేశాడు. తన కంపెనీలో ఉద్యోగులను కూడా ఒక నెలపాటు పనిచేయించుకొని తొలగించేవాడు. దీనిపై సమాచారం అందడంతో సీపీ సూచనమేరకు ఈ బాగోతంపై దృష్టి సారించిన ఉప్పల్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రధాన సూత్రధారి జిన్నా కాంతయ్యతో పాటు కంపెనీ మేనేజర్ భాస్కర్ యాదవ్, లంకప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వెంకటేశ్వర్‌రెడ్డి, అలేఖ్యారెడ్డి, అనిల్‌రెడ్డి, అంజయ్యగౌడ్‌లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
పల్లీ నూనె పేరుతో జనానికి టోకరా
-
ఈడీ షాక్: ఆంద్రాబ్యాంక్ షేరు పతనం
సాక్షి ముంబై : స్టాక్మార్కెట్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్ల పతనం కొనసాగుతోంది. పీఎన్బీ, కెనరా కుంభకోణాలకుతోడు ఇతర స్కాంల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం నాటి మ్యాజిక్ ర్యాలీలో ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్ తన సత్తా చాటగా, పీఎస్‌యూ సెక్టార్మాత్రం చతికిలపడింది. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్, సందేశరాస్ గ్రూపు కుంభకోణం మరోసారి వెలుగులోకి రావడంతో ఆ కేసుతో సంబంధం ఉన్న ఆంధ్రాబ్యాంకు షేరు సోమవారం 52వారాల కనిష్టానికి పతనమైంది. సుమారు రూ.5వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ గార్గ్‌పై తాజాగా మరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసింది. దీంతో న్వెస్టర్లు ఆంధ్రా బ్యాంకు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. చివరికి బీఎస్ఈలో 7శాతంతో నష్టంతో ముగిసింది. మొత్తం 2018 ఏడాదిలో ఇప్పటిదాకా 41శాతానికిపైగా పతనమైంది. అంతేకాదు ఎనలిస్టులు కూడా ఇన్వెస్టర్లకు అప్రమత్తతను సూచించారు. సందేశరాస్ గ్రూపు కుంభకోణం స్టెర్లింగ్ బయోటెక్కుచెందిన సందేశరా గ్రూపు ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి అక్రమ పద్ధతిలో సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం కోసం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా రూ. 2కోట్లను అనూప్ స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. తాజా ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2011లో ఇన్ కంట్యాక్స్ అధికారులు సీజ్ చేసిన డైరక్టర్ డైరీ లో చేతన్ జయంతిలాల్ సందేశారా, నితిన జయంతిలాల్ సందేశారా అనే స్టెర్లింగ్ బయోటెక్ డైరక్టర్లు ఇతగాడికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయని తేలింది. ఈ చెల్లింపులు 2008-09 మధ్య జరిగిన లావాదేవీలుగా ఈడీ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా చార్జ్ షీట్లొ ఆరోపించారు. -
మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!
‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః.. ధ్రువం జన్మ మృతస్య చ..’’ – భగవద్గీత పుట్టినవాడు మరణించక తప్పదు.. మరణించిన వారు మళ్లీ ఇంకో రూపంలో ఎక్క డో ఒకచోట పుట్టక తప్పదు అంటుంది భగవ ద్గీత. అయితే ఇది 21వ శతాబ్దం. గతకాలపు నమ్మకాలను, ప్రకృతి సహజమని భావించే అంశాలనూ టెక్నాలజీతో సవాల్ చేస్తున్న కాలమిది. దీనికి చావు ఎందుకు అతీతంగా ఉండాలని అనుకుందో ఏమో.. ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తున్న బయోక్వార్క్ సంస్థ. చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తామని ప్రక టించింది. ఇది కూడా ఎప్పుడో భవిష్యత్తులో కాదు. ఏడాది తిరక్కముందే ఈ ప్రయోగం పూర్తవుతుందని అంటోంది. చనిపోయిన వాళ్లు మళ్లీ లేచి వచ్చేస్తే.. ఇది కలికాలం కాక మరేమవుతుంది? బయోక్వార్క్ ఏం చేస్తుందో..? దాని ఫలి తాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు అసలు చావు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. వైద్య శాస్త్ర నిఘంటువు ప్రకారం.. గుండె కొట్టుకోవడం మొద లుకుని మెదడు పనిచేయడం వరకూ అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవ డాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మిగిలిన అవయవాల మాట ఎలా ఉన్నప్పటికీ మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవ డాన్నే చావు అని నిర్ణయిస్తారు. ఇలా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేంచేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించామని అంటోంది బయోక్వార్క్. దక్షిణ అమెరికా దేశాల్లో ఒకదానికి చెందిన వ్యక్తిపై 6 నెలల్లో ఈ ప్రయో గం జరుగుతుందని బయోక్వార్క్ సీఈవో ఇరా పాస్టర్ అంటున్నారు. సాధారణ ప్రయోగాల మాదిరిగా జంతువులపై ప్రయోగాలేవీ జరపకుండా నేరుగా మానవులపైనే ఈ ప్రయోగం జరగనుండటం విశేషం. మూలకణాల చికిత్స.. బ్రెయిన్ డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేలా చేసేందుకు బయోక్వార్క్ చేస్తున్న ప్రయోగంలో మూలకణాలదే కీలకపాత్ర. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పించడంతో బయోక్వార్క్ పద్ధతి ప్రారంభమవుతుంది. రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్ నాడిని లేజర్ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజులపాటు చేస్తే అతడి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుం దని బయోక్వార్క్ అంచనా. భారతీయ వైద్యుడి సహకారం.. బ్రెయిన్‌డెడ్ వ్యక్తులను మళ్లీ బతికిస్తామన్న బయోక్వార్క్ ప్రయత్నానికి హిమాన్షు బన్సల్ అనే భారతీయ వైద్యుడు సహకారమందిస్తున్నాడు. గత ఏడాది మేలో హిమాన్షు భారత్‌లోని ఉత్తరాఖండ్‌లోనే ఈ ప్రయోగాలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తామని, అనుమతివ్వమని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు దరఖాస్తు చేశారు కూడా. అయితే ఈ విజ్ఞప్తిని ఐసీఎంఆర్ నవంబర్‌లో తోసిపుచ్చింది. హిమాన్షు ప్రయోగాలకు అవసరమైన పెప్టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లో బయోక్వార్క్ ముందుకు రావడం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడు. కాకపోతే కళ్లు కదపడం.. లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు. కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందన్నది మాత్రం చెప్పలేం! – సాక్షి నాలెడ్జ్ సెంటర్